ETV Bharat / bharat

శిల్పి చెక్కని గుండ్రటి రాళ్లు- దేవతలుగా పూజలు

author img

By

Published : Apr 3, 2021, 12:24 PM IST

సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్లు ఓ ఆకారం అంటూ లేకుండా ఉంటాయి. పక్కా కొలతలతో చెక్కినట్లుండే రాళ్లు సహజంగా ఏర్పడటం చాలా అరుదే. రెండు మూడు సందర్భాల్లో అలా జరిగే అవకాశముంది. కానీ.. మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో మాత్రం ఏకంగా 80కిపైగా ఇలాంటి రాళ్లున్నాయి. నున్నటి ఉపరితలంతో గోళాకారంలో ఉండే రాళ్లివి. వీటిని స్థానికులు దేవతల్లా పూజిస్తారు. ఇంతటి ప్రసిద్ధిగాంచిన ఆ శిలలపై ప్రత్యేక కథనం..

Golyadev in Maharashtra
శిల్పి చెక్కని ఆ గుండ్రటి రాళ్లు.. అక్కడ దేవతలు
మహారాష్ట్ర అమరావతిలోని గోల్యాదేవ్​

మహారాష్ట్రలోని అమరావతిలో నున్నటి ఉపరితలంతో పక్కా కొలతలతో గోళాకారంలో ఉండే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూస్తే భలే ఉన్నాయే అనిపించక మానదు. మేల్​ఘాట్​లోని మల్కాపూర్​గోండ్​ గ్రామంలోని ఓ కాలువ వద్ద ఈ గుండ్రటి రాళ్లు విరివిగా కనిపిస్తాయి. ఈ కాలువలో మాత్రమే ఇవి దొరుకుతాయి. గుండ్రటి రాళ్ల పేరు మీదుగానే ఈ కాలువకు గోల్యాదేవ్ అని పేరుపెట్టారు స్థానికులు. గోల్యాదేవ్​ను గ్రామస్థులు పూజిస్తారు కూడా. గ్రామంలో 4 గోల్యాదేవ్​లు ఉండగా... కొండపైన ఆలయం కూడా నిర్మితమైంది.

"మేం గోల్యాదేవ్​ను పూజిస్తాం. కొండల దగ్గర గుండ్రటి రాళ్లు దొరుకుతాయి."

- అశోక్ మహల్లే, స్థానికుడు

ఇదీ చదవండి: ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం!

300 కిలోలకుపైగా..

1990లలో అటవీ శాఖ ఇక్కడ దాదాపు 80 గుండ్రటి రాళ్లను వెలికితీసింది. కొన్ని రాళ్ల బరువు 300 కిలోలకుపైగా ఉంటుంది. అప్పటి అటవీ అధికారి విజయ్ భోస్లే ఈ రాళ్ల వెలికితీత పనుల్లో కీలక పాత్ర పోషించారు. ఈ రాళ్లు ఏర్పడటానికి రసాయన, యాంత్రిక కారణాలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు.

"ఈ గోళాకారపు, నున్నటి రాళ్లను మనుషులు తయారు చేయలేరు. వీటిని గ్రహాంతరవాసులు తయారుచేసి ఉంటాయని వదంతులు వినిపిస్తాయి. ఇక్కడున్న కొన్ని రాళ్లను భూమిని తవ్వి వెలికితీశారు. మరి కొన్నింటినైతే గ్రామంలో గోల్యాదేవాగా పూజిస్తారు. ఇంకొన్ని రాళ్లు అలా ఊరికే పడున్నాయి. ఈ రాళ్లు పిరంగుల కోసమైతే కచ్చితంగా చేసి ఉండరు. మరి ఎందుకు తయారైనట్లు? పురాతన కాలంలో మనుషులే వీటిని ఎందుకు తయారుచేసినట్లు? ఈ ప్రశ్నలకు సమాధానాల్లేవు."

- డా. జయంత్ వడాట్కర్, హొనొరరీ వైల్డ్​లైఫ్​ వార్డెన్

ఇదీ చదవండి: 'భగవద్గీత ముద్రణా ప్రదేశానికి పూర్వ శోభ కల్పించండి'

కొలతలతో చెక్కినట్లుగా కచ్చితంగా గుండ్రంగా ఉండే ఈ రాళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

"ఈ రాళ్లు నదీతీరాల్లో కనిపిస్తాయి. ఇక్కడైతే నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. ఎత్తుల నుంచి నీరు జారిపడే సమయంలో అడుగున ఉండే రాళ్లు వొరుసుకుపోతాయి. ఈ రాళ్లలో లవణాలు మెండుగా ఉంటాయి. అందుకే రసాయనిక అరుగుదల జరుగుతుంది. ఫలితంగా రాళ్లు గుండ్రంగా తయారవుతాయి."

- డా. శుభాంగీ దేశ్ముఖ్, భూగోళ శాస్త్రవేత్త

భూమిపై ఉండే ఇలాంటి వింతలను చూడడం మీకు ఇష్టమా.? అయితే.. కచ్చితంగా ఈ ప్రదేశానికి వెళ్లి, ఈ గోళాకారపు రాళ్లను చూడాల్సిందే.

ఇదీ చదవండి: మలివయసులోనూ పెన్నూ, పేపరు చేతపట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.