Special shoe for blind: అసోంకు చెందిన కుర్రాడు.. శాస్త్రవేత్తలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంధుల కోసం ఓ సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. చూపు కోల్పోయిన వారు నడుస్తున్నప్పుడు.. అనుక్షణం అప్రమత్తం చేసేలా సెన్సార్‌తో కూడిన బూట్లను తయారుచేశాడు అంకురిత్ కర్మాకర్ అనే విద్యార్థి. రోడ్డుపై ఎదురుగా ఏదైనా వాహనం కానీ, వ్యక్తులు కానీ వచ్చినప్పుడు బూటులో ఏర్పాటు చేసిన సెన్సార్ పెద్దగా శబ్దాలు చేస్తుంది. దీంతో సదరు వ్యక్తులు అప్రమత్తమై సురక్షితంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న అంకురిత్... భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు. తగిన ప్రోత్సాహం అందిస్తే ఈ పరికరాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువస్తానని చెబుతున్నాడు. గొప్ప శాస్త్రవేత్త కావడం తన లక్ష్యమని తెలిపాడు. చూపుకోల్పోయిన వారి కోసం సరికొత్త పరికరాన్ని తయారు చేసిన అంకురిత్.. మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇదీ చదవండి: మంటల్లో సాహసం.. పసిబిడ్డతో పరిగెత్తిన కానిస్టేబుల్