హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఈ ప్రత్యేక గ్రంథాన్ని దక్షిణ భారత దేశంలో ముద్రించిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. చిక్కమంగళూరు జిల్లా, అజ్జంపురా తాలుకాలోని శివానంద ఆశ్రమంలో ఈ పుస్తకాలు అచ్చయ్యేవి. దేశంలోని నలు మూలలా ఇక్కడ ముద్రితమైన గ్రంథాలే పంపిణీ అయ్యాయి. ఇంతటి ప్రత్యేకతను చాటుకున్న ఈ ఆశ్రమం.. పర్యటక ప్రదేశంగానూ విశేష గుర్తింపు పొందింది.
ఆదరణ పొందిందిలా..
1930లో ఈ ఆశ్రమం ప్రారంభమైంది. అక్కడి శంకరానంద స్వామీజీ కాలంలో హిందువుల పవిత్ర గ్రంథం అచ్చయ్యేది. ఆ స్వామీజీ ఉపన్యాసం వినేందుకు.. దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల భక్తులు తరలివెళ్లేవారట. స్వామీజీ ఆరోగ్యానికి సంబంధించిన మూలికా ఔషధాలు కూడా ఇచ్చేవారట. అలా.. ఆయన ద్వారా మూలికలతో పాటు భగవద్గీతనూ తీసుకునేవారు భక్తులు. అక్కడికి వెళ్లిన వారంతా.. స్వామీజీ ప్రసంగాన్ని విని ఎంతో ఆనందించేవారట.
ఇదీ చదవండి: చెక్కపై 'ఒరియా హీరోస్'- కళాకారుడి అద్భుత సృష్టి
శోభ కోల్పోయిందిలా..
కానీ, శంకరానంద అకాల మరణం తర్వాత.. భగవద్గీత ముద్రణ నిలిచిపోయింది. ప్రజల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. కేవలం కొద్ది మందే ఇప్పుడా ఆశ్రమాన్ని సందర్శిస్తున్నారు. పర్యటక ప్రదేశంగానూ ఆదరణ కోల్పోయింది.
అంతటి విశేష గుర్తింపు పొందిన శివానంద ఆశ్రమాన్ని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. ఆ ఆశ్రమంలో భగవద్గీత గ్రంథాన్ని అచ్చు వేయడం పునఃప్రారంభించాలని అధికారులను కోరారు స్థానికులు. పర్యటక పరంగానూ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: డిజిటల్ మార్కెటింగ్‌లో రాణిస్తూ విశేష గుర్తింపు