ETV Bharat / bharat

'అది మా రక్తంలోనే ఉంది.. ఐదేళ్లలో రాజకీయాల్లోకి వస్తా!' - మోగా న్యూస్​

Sonu sood news: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్ మరింత స్పష్టత ఇచ్చారు. ఇంకో ఐదేళ్లపాటు సమాజ సేవ చేసి, ఆ తర్వాత రాజకీయ చదరంగంలో అడుగుపెడతానని చెప్పారు. ప్రజలకు సేవ చేసే గుణం.. తమ కుటుంబ రక్తంలోనే ఉందని అన్నారు సోనూసూద్.

sonu sood
సోనుసూద్
author img

By

Published : Jan 24, 2022, 5:19 PM IST

'అది మా రక్తంలోనే ఉంది.. ఐదేళ్లలో రాజకీయాల్లోకి వస్తా!'

Sonu sood news: పంజాబ్​ శాసనసభ ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొన్నా.. కాంగ్రెస్​కే విజయావకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్. కాంగ్రెస్​ తరఫున మోగా నుంచి పోటీచేస్తున్న తన సోదరి మాళవికా సూద్​కు మద్దతుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఆయన. కాంగ్రెస్​కు ఓటేయాలని నేరుగా ప్రచారం చేయకపోయినా.. తన సోదరిని గెలిపించాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు.

ఆ పార్టీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది!

తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా, తమ పార్టీలో చేరాల్సిందిగా కొన్ని పార్టీల నేతలు కోరారని ఏఎన్​ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు సోనూసూద్. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని రెండుసార్లు ఆఫర్లు కూడా వచ్చాయని తెలిపారు. అయితే.. అందుకు నిరాకరించానని చెప్పిన సోను.. ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందనే విషయం బహిర్గతం చేయలేదు.

"నేను రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా. కానీ ఇప్పుడే కాదు. ఓ ఐదేళ్లపాటు సమాజ సేవపై మరింత దృష్టిపెడతా. ఆ తర్వాత రాజకీయాల సంగతి చూస్తా. నా ఆలోచనా శైలితో సారూప్యతలు ఉన్న పార్టీతో కలుస్తా. ఈ పదవికి నువ్వే అర్హుడివి, వచ్చి అభ్యర్థిగా నిలబడు అని అందరూ అనే స్థాయికి ఎదిగాక వస్తా" అని చెప్పారు సోనూసూద్.

ఆకాశం నుంచి ఊడిపడ్డారా?

ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు.. మాళవికకు ఒక్కసారిగా మోగా టికెట్ కేటాయించారన్న విమర్శలను సోను తోసిపుచ్చారు. ఆమెను హెలికాప్టర్ క్యాండిడేట్, పారాషూట్ క్యాండిడేట్ అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ తల్లిదండ్రులు, తాను, మాళవిక మోగాలో ఎప్పటినుంచో సేవా కార్యక్రమాలు సాగిస్తున్నామని... ప్రజాసేవ చేసే గుణం తమ రక్తంలోనే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా.. సేవా యజ్ఞం మాత్రం ఆగబోదని తేల్చిచెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: కాంగ్రెస్​లో తండ్రి.. ప్రత్యర్థి పార్టీలోకి కుమారుడు.. ఎన్​డీఏ తొలి ముస్లిం అభ్యర్థిగా రికార్డ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.