ETV Bharat / bharat

'బ్లాక్​ ఫంగస్​' చికిత్సపై మోదీకి సోనియా లేఖ - కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

దేశవ్యాప్తంగా మ్యూకర్​మైకోసిస్​(బ్లాక్​ఫంగస్​) కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో.. చికిత్సకు సరిపడ అత్యవసర ఔషధాలను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. బ్లాక్ ఫంగస్​ను ఆయుష్మాన్​ భారత్ పథకం​లో చేర్చాలని ప్రధానికి లేఖ రాశారు.

Sonia gandhi
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
author img

By

Published : May 22, 2021, 1:54 PM IST

దేశంలో బ్లాక్​ ఫంగస్​ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. బ్లాక్​ ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని సూచించారు. చికిత్సకు సరిపడ అత్యవసర ఔషధాలను సరఫరా చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Sonia urges PM modi
ప్రధానికి సోనియా లేఖ

" బ్లాక్ ​ఫంగస్​ను సాంక్రమిక చట్టం కింద పరిగణించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. దీని అర్థం.. వ్యాధిని అరికట్టేందుకు సరిపడ ఔషధాలు ఉత్పత్తి, సరఫరా అవసరం. బ్లాక్​ ఫంగస్​ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలి. ఈ వ్యాధిని ఆయుష్మాన్​ భారత్​కింద చేర్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోండి."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

దేశవ్యాప్తంగా మ్యూకర్​మైకోసిస్​(బ్లాక్​ఫంగస్​)కేసులు పెరుగుతన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్​ సహా పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి.

ఇదీ చదవండి : బ్లాక్​ ఫంగస్ ఔషధ ఉత్పత్తికి కేంద్రం చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.