ETV Bharat / bharat

షాకిచ్చిన సోనియా.. పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు ఆదేశం - pcc chiefs resign today

Sonia Gandhi PCC chiefs resign: ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఘోర వైఫల్యం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. సంస్కరణల దిశగా అడుగులు వేసింది. ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్​లను రాజీనామా చేయాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు.

CONGRESS PCC RESIGN
CONGRESS PCC RESIGN
author img

By

Published : Mar 15, 2022, 7:33 PM IST

Updated : Mar 15, 2022, 8:43 PM IST

Sonia Gandhi PCC chiefs resign: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌ అయింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు ఉద్వాసన పలికారు! వీరిలో పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ కూడా ఉన్నారు. పీసీసీలను పునర్‌వ్యవస్థీకరించేందుకు వీలుగా ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ పీసీసీ అధ్యక్షులు రాజీనామాలు చేయాలని సోనియా గాంధీ కోరినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో వెల్లడించారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా.. ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఎలాంటి ప్రభావం చూపలేక పూర్తిగా చతికిలపడింది కాంగ్రెస్. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఇంకొంత కాలం సోనియా గాంధీయే కొనసాగాలని నిర్ణయించారు. అలాగే, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపోటమిలకు కారణాలను సమీక్షించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఉత్తరాఖండ్​ పీసీసీ రాజీనామా..

పార్టీ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గణేష్‌ గోడియాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించినట్లు ఆయన తెలిపారు.

కపిల్​ సిబల్​పై మాణిక్కం ఫైర్​..

మరోవైపు, కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​పై మరో నాయకుడు మాణిక్యం ఠాగూర్​ మండిపడ్డారు. పార్టీలో విభేదాలను ప్రతిబింబించేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆర్​ఎస్​ఎస్​, భాజపాలు కోరుకుంటున్నట్లు సిబల్​ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్​ పార్టీ నాయకత్వం బాధ్యతల నుంచి గాంధీ కుటుంబాన్ని తొలగించాలని భాజపా చూస్తున్నట్లు పేర్కొన్నారు.

సిబల్​ ఏమన్నారంటే..?

'కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఆసన్నమైంది. వారిచేత నియమించిన కమిటీ.. గాంధీలకు ఆ విషయాన్ని చెప్పలేదు. అందుకే వారే స్వయంగా తప్పుకోవాలి. పార్టీ అధికార పగ్గాలు వారి చేతుల్లో ఉండకూడదు' అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్ సిబల్‌ పేర్కొన్నారు. ఇక పంజాబ్‌ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించిన తీరునూ తప్పుబట్టారు. 'రాహుల్‌ గాంధీ పంజాబ్‌కు వెళ్లి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించారు. ఏ అధికారంతో ఆయన ప్రకటించారు? రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడు కాదు. కానీ, అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆయనే ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని అడగడమేంటి?' అని కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ చరిత్రలోనే చెత్త రికార్డు​- 97% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు!

Last Updated : Mar 15, 2022, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.