ETV Bharat / bharat

Sonia Gandhi Parliament Speech Today : 'మహిళా రిజర్వేషన్లు రాజీవ్ కల.. వెంటనే అమలు చేయండి.. ఆలస్యమైతే అన్యాయమే!' - dmk vs bjp

Sonia Gandhi Parliament Speech Today : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్​ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ సోనియా గాంధీ తెలిపారు. ఈ బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని సోనియా అన్నారు. చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలని కోరారు.

Sonia Gandhi Parliament Speech Today
Sonia Gandhi Parliament Speech Today
author img

By PTI

Published : Sep 20, 2023, 12:09 PM IST

Updated : Sep 20, 2023, 12:46 PM IST

Sonia Gandhi Parliament Speech Today : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యం జరిగితే.. అది భారత మహిళలకు తీరని అన్యాయం చేసినట్లేనని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై విపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ తరపున మద్దతు తెలిపిన సోనియా.. ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో నారీ శక్తి వందన్ అధినియమ్​కు మద్దతుగా తాను ఇక్కడ నిలబడ్డానని తెలిపారు. అడ్డంకులు అన్నింటిని తొలగించి మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని సోనియా కోరారు.

  • #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "Congress party supports this Bill. We are happy regarding the passing of the Bill but we are also concerned. I would like to ask a question. Indian women have been waiting for their… pic.twitter.com/H3VDbcG6ki

    — ANI (@ANI) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత జాతీయ కాంగ్రెస్ తరఫున నేను '2023-నారీశక్తి వందన్ అధినియమ్'కు మద్దతు తెలుపుతున్నాను. ఈ బిల్లు ఆమోదం పొందుతున్నందుకు మేం సంతోషంగా ఉన్నాం. అలాగే ఆందోళనగా కూడా ఉన్నాం. నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. గడచిన 13 ఏళ్లుగా భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతల కోసం వారు ఇంకా కొన్నాళ్లు ఆగాలి. అదే ఎన్నాళ్లు? రెండేళ్లా, నాలుగేళ్లా.. ఆరేళ్లా.. ఎనిమిదేళ్లా? చెప్పండి. భారత మహిళలతో ఇలాంటి ప్రవర్తన సరైదనదేనా? ఈ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియమ్)ను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. కుల గణనను కూడా నిర్వహించి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లోని మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాం."
--సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

  • #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "This is an emotional moment of my own life as well. For the first time, Constitutional amendment to decide women's representation in local body election was brought by my life partner… pic.twitter.com/stm2Sggnor

అంతకుముందు.. లోక్​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​రామ్ మేఘవాల్​ ప్రసంగించారు. ఈ బిల్లు చాలా ముఖ్యమైనదని.. ఏకగ్రీవంగా ఆమోదించాలని లోక్​సభ సభ్యులను విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళల గౌరవాన్ని పెంచుతుందని అన్నారు. 'బిల్లుపై చర్చ సందర్భంగా ఎలాంటి సూచనలు వచ్చినా ప్రభుత్వం పరిశీలిస్తుంది. పార్లమెంటుతో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళా రిజర్వేషన్‌ చట్టంతో మహిళా సాధికారత సాధ్యమవుతుంది. పదిహేనేళ్లపాటు మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో ఉంటుంది.' అని అన్నారు.

'రాజకీయ లబ్ధి కోసమే'
మరోవైపు.. రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును బీజేపీ తెచ్చిందని డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. బిల్లు కోసం గతంలో ఎన్నోసార్లు ఆందోళనలు జరిగాయని.. మహిళలకు వందనాలు కాదు సమానత్వం కావాలని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడడం పట్ల తాను సంతోషిస్తున్నానని కనిమొళి తెలిపారు.

  • VIDEO | "I am happy to be speaking about the Women's Reservation Bill. We thought this Bill will be passed with all of us supporting each other and standing together. But unfortunately, the BJP has taken this also as an opportunity for politicking," says DMK MP @KanimozhiDMK in… pic.twitter.com/GDHmPFYYUp

    — Press Trust of India (@PTI_News) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 20, 2023, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.