ETV Bharat / bharat

స్టాన్​ స్వామి మృతిపై రాష్ట్రపతికి విపక్షాల లేఖ

హక్కుల నేత స్టాన్‌ స్వామిపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కోరారు సోనియా గాంధీ సహా విపక్ష నేతలు. భీమా కొరెగావ్‌ కేసు నిందితులను విడుదల చేయాలని విన్నివించారు.

Father Stan Swamy
స్టాన్​ స్వామి
author img

By

Published : Jul 6, 2021, 9:21 PM IST

హక్కుల నేత స్టాన్​ స్వామి మృతిపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ సహా 10 విపక్ష పార్టీల నేతలు. స్టాన్​ స్వామిపై తప్పుడు కేసులు బనాయించి, నిరంతరం నిర్భందంలోనే ఉండేలా అమానవీయంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సోనియా గాంధీతో పాటు మాజీ ప్రధాని దేవె గౌడ, ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు​ సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఫరూక్​ అబ్దుల్లా, డి. రాజా, సీతారాం ఏచూరీ, తేజస్వీ యాదవ్ సంతకాలు చేసినవారిలో ఉన్నారు.

భీమా కొరేగావ్ నిందితుడిగా ఉన్న ఫాదర్ స్టాన్​ స్వామి గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే ఆయన చనిపోయారని ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. భీమా కొరెగావ్‌ సహా రాజకీయ ప్రేరేపిత కేసుల్లో జైలుపాలైనవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.

దేశ ద్రోహం, యూఏపీఏ చట్టాలను దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరిన నేతలు.. ఆయా కేసుల్లో జైలుపాలైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

'చట్టాన్ని ఉల్లంఘించినందుకే'

అయితే విపక్షాల ఆరోపణలను ఖండించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. చట్టం ప్రకారమే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).. స్టాన్​ స్వామి అరెస్టు, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. అధికారులు.. చట్టాన్ని ఉల్లంఘించినవారిపైనే చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది.

ఇదీ చూడండి: స్టాన్ స్వామి మృతి- కేంద్రంపై విపక్షాల ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.