ETV Bharat / bharat

మోదీ-యోగికి ప్రజా సమస్యలు పట్టవు: సోనియా - సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం

Sonia Gandhi News: ప్రధాని మోదీ- యూపీ సీఎం యోగికి ప్రజా సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రజలను విభజించడం తప్ప భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాయ్​బరేలీపై భాజపా సవతితల్లి ప్రేమను కనబరుస్తోందని దుయ్యబట్టారు.

Sonia Gandhi hits the campaign trail in UP
'మోదీ-యోగికి ప్రజా సమస్యలు పట్టవు- ఈ ఎన్నికలు కీలకం'
author img

By

Published : Feb 21, 2022, 5:24 PM IST

Sonia Gandhi Raebareli: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం తన సొంత నియోజకవర్గం రాయ్​బరేలీ ప్రజలతో వర్చువల్​గా మాట్లాడారు. భాజపా ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ప్రజా సమస్యలు పట్టవని దుయ్యబట్టారు. భాజపా హయాంలో ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్యజమెత్తారు. రాయబరేలీపై ఆ పార్టీ సవతితల్లి ప్రేమ కనబరుస్తోంది తప్ప.. వాస్తవానికి చేసిందేం లేదని ఆరోపించారు.

" ఈ ఎన్నికలు మీకు చాలా కీలకం. గత ఐదేళ్ల కాలంలో ప్రజలను విభజించడం తప్ప భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదు. రైతు సోదరులు కష్టపడి పంట పండిస్తే వాటికి సరైన ధర దక్కడం లేదు. అన్నదాతలకు ఎరువులు అందడం లేదు. సాగు నీటి సదుపాయం లేదు. అప్పుల్లో కూరుకుపోతున్నారు. జంతువులు పంటలను నాశనం చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. బంగారు భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటున్నారు. 12 లక్షల ప్రభుత్వ కొలువులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పెట్రోల్, డీజిల్​, గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యులు జీవనం సాగించడం కష్టతరమైంది."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి.

Sonia Virtual Rally

కరోనా లాక్​డౌన్ సమయంలో వలస కార్మికలు బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు సోనియా. వందల కి.మీ కాలినడకన ప్రయాణించి తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఆక్సిజన్​ అందుక, ఆస్పత్రుల్లో పడకలు దొరక్క ప్రజల తమకు కావాల్సిన వారిని కోల్పోయిన దుస్థితిని చూశామన్నారు. మోదీ-యోగి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి వెన్ను చూపారని, కళ్లు మూసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజల పట్ల వారు అంత కఠినంగా వ్యవహరించడం దురదృష్టమన్నారు. కరోనా కష్టకాలంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు కేటాయించాల్సింది పోయి.. కోత విధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలకు భాజపా చరమగీతం పాడిందని ఆరోపించారు.

UP Assembly Polls

నాలుగో విడతలో భాగంగా రాయ్​బరేలీ సహా యూపీలోని 9 జిల్లాల్లో 60 స్థానాలకు ఫిబ్రవరి 23న ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ గాంధీని ఓడించిన భాజపా.. ఇప్పుడు రాయ్​బరేలీలో కూడా అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి కమలం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో హస్తం పార్టీకి ఆ రెండు స్థానాలు తిరిగి దక్కించుకోవడం కష్టంగా మారింది.

ఇదీ చదవండి: దాణా స్కామ్​ కేసులో లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.