ETV Bharat / bharat

దిల్లీని వీడనున్న సోనియా గాంధీ! - కాంగ్రెస్​ పార్టీ

దేశరాజధాని దిల్లీని కొద్ది రోజుల పాటు వీడనున్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో శ్వాసకోస సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్న కారణంగానే వైద్యులు ఆమెను హస్తినను వీడాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గోవా లేదా చెన్నైకి సోనియా వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి.

Sonia Gandhi
దిల్లీని వీడనున్న సోనియా గాంధీ!
author img

By

Published : Nov 20, 2020, 11:27 AM IST

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొద్ది రోజుల పాటు దిల్లీని వీడనున్నారు. దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్యతో సోనియా బాధపడుతున్నారు. దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున ఈ మేరకు వైద్యులు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గోవా లేదా చెన్నైకి సోనియా మారే అవకాశం ఉందని వెల్లడించాయి.

శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరనున్నట్లు సమాచారం. సోనియాతో పాటు రాహుల్​ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆగస్టులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీర్ఘకాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఇది దిల్లీ కాలుష్యం వల్ల కాదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, కాలుష్యం వల్ల ఆస్తమా పెరగటంతోనే దిల్లీని వీడాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు.

బిహార్​ ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై సమీక్షించాల్సిన అవసరం ఉందని కొందరు సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్న క్రమంలో సోనియా.. దిల్లీ నుంచి ఇతర ప్రాంతానికి మారటం ప్రాధాన్యం సంతరించుకుంది.

గోవాలో..

గత ఏడాది జనవరిలో కొద్ది రోజుల పాటు గోవాలో నివాసం ఉన్నారు సోనియా. ఆ సమయంలో ఆమె సైక్లింగ్​ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

జులై 30న ఆసుపత్రిలో చేరిక..

జులై 30న దిల్లీలోని శ్రీ గంగా రామ్​ ఆసుపత్రిలో చేరారు సోనియా. ఆ తర్వాత సెప్టెంబర్​ 12న విదేశాలకు సాధారణ పరీక్షల కోసం వెళ్లారు. ఆమెతో పాటు రాహుల్​ గాంధీ వెళ్లారు. అదే సమయంలో పార్లమెంట్​ సమావేశాలు జరగటం వల్ల గైర్హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.