ETV Bharat / bharat

ఈ మరుగుజ్జుల పెళ్లి అదుర్స్..​! వివాహ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. - రాజస్థాన్​ లేటెస్ట్ న్యూస్

ఓ జంట వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇందులో వధూవరులిద్దరూ మరుగుజ్జులు. ఈడు జోడున్న ఈ జంటను చూసిన వారంతా విషెస్ చెబుతున్నారు.

Marriage of dwarf couple in rajasthan
మరుగుజ్జు జంట వివాహం
author img

By

Published : Jan 29, 2023, 12:41 PM IST

మరుగుజ్జు జంట వివాహం

రాజస్థాన్​లో ఓ జంట వివాహం చేసుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. వధూవరులిద్దరూ మరుగుజ్జులు. ఈడూ జోడున్న ఈ జంటను చూసిన వారంతా వారికి అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ ​మీడియాలో పరిచయమైన ఈ జంట.. అనంతరం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది.

జోధ్​పుర్​కు చెందిన సాక్షి అనే యువతికి రాజ్​ సమంద్​కు చెందిన రిషబ్​తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించి ఏడాది క్రితమే వాళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిపించారు. గురువారం వారి వివాహం ఘనంగా జరిగింది. సాక్షి, రిషబ్​ జంట ఇన్​స్టాగ్రామ్​లో 'మినీ కపుల్'​ అనే ఐడీని క్రియేట్ చేసి వారి పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్​ను పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ జంటను చూసినవారంతా వారిద్దరికీ విషెస్ తెలుపుతున్నారు. సోషల్​ మీడియాలో ఈ జంట యాక్టివ్​గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ జీవితంలో జరిగే విషయాలను పంచుకుంటున్నారు. రిషబ్​కు ఇన్​స్టాగ్రామ్​లో 2,000 పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎంబీఏ చదివిన సాక్షి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పాఠాలు భోదిస్తుంది. రిషబ్ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

Marriage of dwarf couple in rajasthan
మరుగుజ్జు జంట వివాహం
Marriage of dwarf couple in rajasthan
మరుగుజ్జు జంట వివాహం

ఇంతకుముందు కూడా ఇలాంటి ఓ వివాహం నెట్టింట వైరల్​గా మారింది. పొట్టిగా ఉన్నందున తనకు పెళ్లి కావట్లేదని మరుగుజ్జు యువకుడు అజీమ్​ మసూరి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. యువతి దొరికినా కూడా 2019 నుంచి ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి చేయట్లేదని పోలీస్ స్టేషన్​కు వెళ్లాడు. ఎట్టకేలకు పోలీసుల సహాయంతో పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.