Snowfall in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సీజన్లో రెండోసారి భారీగా మంచు కురిసింది. లహాల్-స్పితి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి వెళ్లాయి. ఎత్తైన ప్రాంతాల్లో జలపాతాలు, పైపుల్లో నీరు గడ్డకట్టిపోయింది. మంచు దుప్పటితో ఆయా ప్రాంతాలు శ్వేతవర్ణశోభితమై కనువిందు చేస్తున్నాయి.
హిమపాతాన్ని ఆస్వాదించేందుకు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, మనాలి వంటి ప్రాంతాలకు పోటెత్తుతున్నారు పర్యటకులు. హిమపాతం మధ్య కేరింతలు కొడుతున్నారు. భారీగా పేరుకుపోయిన మంచులో ఆటలు ఆడుతూ ఆనందంగా గడుపుతున్నారు.
మరోవైపు.. ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. నీరు ఎక్కడికక్కడ గడ్డకట్టి పోతోంది. తాగునీటికే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.