Snake Died after biting Child: సాధారణంగా పాము కరిస్తే మనుషులు మరణించిన ఘటనలు ఎన్నో చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పాము.. నాలుగేళ్ల బాలుడిని కరిచి క్షణాల్లోనే మృతిచెందింది. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బుధవారం జరిగింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడం వల్ల అనేక మంది బాలుడిని చూడడానికి వచ్చారు.
ఇదీ జరిగింది: బరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు నాలుగేళ్ల అనూజ్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. అనూజ్ తన తల్లితో సహా కుచాయ్కొట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనూజ్.. ఇంటి ముందు ఆడుకుంటుండగా.. అకస్మాత్తుగా ఓ విషసర్పం కాటు వేసింది. అయితే అతడిని కరిచిన కొద్ది క్షణాల్లోనే పాము చనిపోయింది. బాలుడు ఏడవడం గమనించిన కటుంబసభ్యులు అడగగా.. పాము కరిచిన విషయాన్ని చెప్పాడు. ఘటన స్థలానికి వెళ్లి చూడగా పాము చనిపోయి ఉంది. ఆ పామును డబ్బాలో తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: భార్యకు ముద్దుపెట్టాడని భర్తను కొట్టారు.. కారణమేంటి?