ETV Bharat / bharat

'భరతమాత' వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఫైర్​.. రాహుల్ 'ఫ్లయింగ్ కిస్​'పై దుమారం - పార్లమెంట్ లేటెస్ట్ న్యూస్

Smriti Irani Parliament Speech Today : మణిపుర్​పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఆయన వ్యాఖ్యలను ఖండించిన స్మృతి.. పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి మాట్లాడారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై రాహుల్​ మాట్లాడిన అనంతరం ఆమె ప్రసంగించారు.

smriti irani today speech
smriti irani today speech
author img

By

Published : Aug 9, 2023, 2:35 PM IST

Smriti Irani Parliament Speech Today : మణిపుర్​లో భరతమాత హత్యకు గురైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి మాటలు మాట్లాడారని విమర్శించారు. భరత మాతను హత్య చేశారని రాహుల్​ అంటే కాంగ్రెస్‌ సభ్యులు బల్లలు చరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై రాహుల్​ గాంధీ మాట్లాడిన అనంతరం ఆమె ప్రసంగించారు. మణిపుర్​ ఎప్పటికీ మన దేశంలో భాగమేనని.. దీనిని ఎవరూ విడదీయలేరని తేల్చి చెప్పారు.

"దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్‌ పార్టీయే. మహిళలపై అత్యాచారాలు యూపీఏ హయాంలో చాలా జరిగాయి. రాజస్థాన్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ చేసి.. ముక్కలుగా నరికేశారు. గిరిజా టిక్కు, సరళా భట్‌ వంటి ఘటనలు కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయి. ఆర్టికల్‌ 370 రద్దు వల్లనే రాహుల్‌ పాదయాత్ర చేయగలిగారు. ఆర్టికల్‌ 370 మళ్లీ తెస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. కశ్మీర్‌ పండితులకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా? కశ్మీర్‌ మహిళలకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా? మీరు ఇండియానే కాదు. మీ కూటమిలోని తమిళనాడుకు చెందిన ఓ నేత ఇండియా అంటే కేవలం ఉత్తరభారతం మాత్రమేనని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై రాహుల్ ఎందుకు స్పందించరు? ఒకప్పుడు కశ్మీర్ ​లోయలో రక్తం ఏరులై పారేది. కానీ మోదీ ఆర్టికల్​ 370 రద్దు చేసిన తర్వాత మీరు వెళ్లి హాయిగా మంచు గడ్డలతో ఆడుకోగలిగారు. మీరు ఇండియా కాదు. మీరు అవినీతి, కుటుంబ పాలనుకు ప్రతీకలు. ఇప్పుడు ప్రజలంతా అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా క్విట్​ ఇండియా అని నినదిస్తున్నారు. "

--స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

రాహుల్ 'ఫ్లయింగ్ కిస్​'పై దుమారం
No Confidence Motion Smriti Irani Speech : రాహుల్​ గాంధీ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఆయనకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తే.. మహిళా సభ్యులు ఉన్న పార్లమెంట్​లో అసభ్యకరంగా ఫ్లయింగ్ కిస్​లు ఇచ్చారని అభ్యంతరం తెలిపారు. ఇదీ పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదన్నారు. "మణిపుర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పార్లమెంట్​ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ చెప్పారు. కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనకుండా పారిపోయాయి." అని ఆరోపించారు.

  • #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "...He went outside the country...Rahul Gandhi said 'There is going to be a mass upsurge, now the question is how can the Opposition effectively use the upsurge to change politics'. He then said, 'Kerosene has spread across… pic.twitter.com/wHpaMN2pVT

    — ANI (@ANI) August 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "I object to something. The one who was given the chance to speak before me displayed indecency before leaving. It is only a misogynistic man who can give a flying kiss to a Parliament which seats female members of Parliament.… pic.twitter.com/xjEePHKPKN

'మణిపుర్​లో భరతమాత హత్య.. అందుకే ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ దూరం'

'ప్రధాని మౌనవ్రతం ముగించేందుకే అవిశ్వాసం.. వీడియోలు రాకుంటే మోదీ నోరు విప్పేవారు కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.