'భారత సరిహద్దుల్లోకి చైనా డ్రోన్లు తరచూ చొరబడుతూ కలకలం సృష్టిస్తున్నాయి. పంజాబ్,జమ్ము ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకే వీటిని వాడుతున్నట్లు తమ పరిశోధనలో తేలింది' అని బీఎస్ఎఫ్ డీజీ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. చిన్న పేలోడ్‌లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్లను 95 శాతం డ్రగ్స్ సరఫరాకే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే దేశ భద్రతకు ఆందోళన కలిగించే వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిష్కారాలు మనవద్దు ఉన్నాయి' అని స్పష్టం చేశారు. పారామిలటరీ 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పలు అంశాలపై మాట్లాడారు. భారత్-పాక్ సరిహద్దులో ఇప్పటి వరకు కనీసం 67 డ్రోన్లు కనిపించాయన్నారు.
"సరిహద్దులో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం అవి చాలా బాగా పనిచేస్తున్నాయి. అయితే ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని సొంతం చేసుకోవడం మా మొదటి ప్రాధాన్యత."
--పంకజ్ కుమార్ సింగ్, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్
'స్మార్ట్ ఫెన్సింగ్', సెన్సార్లు, రాడార్లు, డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) ముప్పును ఎదుర్కొనేందుకు "తక్కువ ధరలో ఉత్తమమైన సాంకేతిక పరిష్కారాల" దిశగా సైన్యం పనిచేస్తోందని తెలిపారు.
సవాళ్లను దీటుగా..
పటిష్ఠ భద్రత, నిఘా కారణంగా భారత్-పాక్ సరిహద్దులో శాంతి నెలకొంటుందని బీఎస్‌ఎఫ్ ఐజీ డీజీ డీకే బురా అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో పెరిగిన డ్రోన్ కార్యకలాపాలు, టన్నెల్ ద్వారా స్మగ్లింగ్ వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) 57వ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఆయన భద్రతా దళాలకు శుభాకాంక్షలు తెలిపారు.
బీఎస్ఎఫ్ 1965 డిసెంబర్ 1న ఏర్పాటైంది. ప్రస్తుతం దాదాపు 2.65 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు మొత్తం 6,300 కిమీ. పైగా భారత సరిహద్దులను పహారా కాస్తోంది.
ఇవీ చదవండి: