ETV Bharat / bharat

సీడీ కేసు: అజ్ఞాతంలోకి రమేశ్​ జార్ఖిహోళి!

సీడీ వ్యవహారంలో.. సిట్​ విచారణకు సోమవారం హాజరైన కర్ణాటక మాజీ మంత్రి రమేశ్​ జార్ఖిహోళి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్​కు దరఖాస్తు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, సీడీలో కనిపించిందని భావిస్తున్న మహిళ తల్లిదండ్రులు మాత్రం ఈ కుట్ర వెనుక కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ హస్తం ఉందని ఆరోపించారు. తమ కుమార్తె కొద్దిరోజులుగా మానసిక సమస్యతో బాధ పడుతున్నందున.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి గడువు కావాలని కోరారు.

Jarakiholi
సీడీ కేసు: అజ్ఞాతంలో రమేశ్​ జార్ఖిహోళి!
author img

By

Published : Mar 30, 2021, 6:31 AM IST

Updated : Mar 30, 2021, 9:17 AM IST

కర్ణాటక సీడీ కేసు విచారణలో భాగంగా.. ఆ రాష్ట్ర మాజీ మంత్రి రమేశ్​ జార్ఖిహోళిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) సోమవారం తొలిసారి ప్రశ్నించింది. విచారణ పూర్తైన తర్వాత సిట్​ కార్యాలయం వెనుక ద్వారం నుంచి బయటకు వచ్చిన ఆయన.. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సీడీ వ్యవహారంలో ఆయన ముందుస్తు బెయిల్​ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రమేశ్​ జార్ఖిహోళితో పాటు అసభ్యకర వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ ఫిర్యాదు ఆధారంగా.. సిట్​ బృందం విచారణకు హాజరు కావాలని రమేశ్​ జార్ఖిహోళికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం విచారణకు హాజరయ్యారు.

ఇదీ జరిగింది..

మాజీ మంత్రి రమేశ్.. ఓ మహిళతో అసభ్యకరమైన రీతిలో ఉన్న వీడియో ఇటీవల బయటకు వచ్చింది. అనంతరం దానిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అయితే రమేశ్​తో వీడియోలో ఉన్నట్లుగా భావిస్తున్న మహిళ.. సీడీలో ఉన్నది తాను కాదని చెబుతూ అనేక వీడియోలు, ఆడియోలు విడుదల చేసింది.

'చేసిందంతా శివకుమారే'

అయితే.. తమ కుమార్తెను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ ప్రలోభపెట్టారని వీడియోలోని సదరు మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. 25 రోజులుగా తమ కుమార్తె మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పారు. తమ కుమార్తెకు చికిత్స అవసరం కాబట్టి.. ఆమె ప్రస్తుతం తన వాంగ్మూలాన్ని నమోదు చేయలేదని పేర్కొన్నారు. తనకు కొంత గడువు కావాలని కోరారు.

సాక్ష్యాలున్నాయ్​..

డీకే శివకుమారే తమ కూతురితో ఈ వ్యవహారం అంతా నడిపించారని చెప్పేందుకు 11 సాక్ష్యాధారాలు ఉన్నాయని మహిళ తల్లిదండ్రులు చెప్పారు. ఆయనపై కేసు పెట్టే ముందు కుమార్తెను తమ వద్దకు రప్పించాలని కోరారు. అనంతరం ఈ విషయమై.. న్యాయవాదులను కలుస్తామని చెప్పారు.

రమేశ్ జార్ఖిహోళితో పాటు వీడియోలో ఉన్నది తాను కాదని.. జార్ఖిహోళి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచిన ఉందని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సదరు మహిళ లేఖ రాసింది. దర్యాప్తును ప్రధాన న్యాయమూర్తి దగ్గరుండి పర్యవేక్షించాలని కోరింది.

ఇదీ చూడండి: కాంగ్రెస్‌కు తిరుగుబాణమైన రాసలీలల సీడీ

Last Updated : Mar 30, 2021, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.