Skulls bones in hospital: మహారాష్ట్ర వార్దా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎముకలు, పుర్రెలు దొరకడం కలకలం రేపింది. కదం ఆస్పత్రి ప్రాంగణంలోని బయోగ్యాస్ ప్లాంటును తనిఖీ చేసిన పోలీసులు.. 11 పుర్రెలు, 54 భ్రూణ ఎముకలను గుర్తించారు.
Maharashtra hospitals illegal abortion
చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారన్న ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఎముకలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఎముకలను చట్టబద్ధంగానే తొలగించారా లేదా అన్న విషయంపై దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Illegal abortion bones skulls hospital
అక్రమ అబార్షన్ల విషయమై రేఖా కదం అనే వైద్యురాలిని, ఓ నర్సును జనవరి 9న అరెస్టు చేశారు పోలీసులు. పదమూడేళ్ల బాలికకు వీరు అబార్షన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజా తనిఖీలు చేపట్టారు.
బాలుడి తల్లిదండ్రులే..
బాలిక గర్భం దాల్చడానికి కారణమైన 17 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబార్షన్ చేయించుకోకపోతే.. బాలిక పరువుకు భంగం కలిగేలా చేస్తామని బాలుడి తల్లిదండ్రులు బెదిరించారని పోలీసులు తెలిపారు. అబార్షన్ కోసం డబ్బులు సైతం చెల్లించారని చెప్పారు. ఈ ఘటనపై పోక్సో, ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు యువతుల ప్రేమాయణం.. ఇంట్లోంచి పారిపోయి వివాహం