ETV Bharat / bharat

SJVN Engineering Jobs 2023 : మినీ రత్న SJVNలో.. ఇంజినీరింగ్​, ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! - SJVN Job Online Apply Process

SJVN Engineering Jobs 2023 In Telugu : మినీ రత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ SJVN లిమిటెడ్​ 155 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్​, జూనియర్​ ఫీల్డ్​ ఆఫీసర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలు మీ కోసం.

SJVN recruitment 2023
SJVN Engineering Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 10:42 AM IST

SJVN Engineering Jobs 2023 : ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మినీ రత్న హోదా కలిగిన ఎస్​జేవీఎన్​ లిమిటెడ్​ 155 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.

ఉద్యోగాల వివరాలు

  • సివిల్​ జూనియర్​ ఫీల్డ్​ ఇంజినీర్​ - 90
  • ఎలక్ట్రికల్​ జూనియర్​ ఫీల్డ్​ ఇంజినీర్​ - 15
  • మెకానికల్ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్ - 10
  • హెచ్​ఆర్​ జూనియర్​ ఫీల్డ్ ఆఫీసర్​​ - 10
  • ఎఫ్ ​& ఏ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్​ - 12
  • ఐటీ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్​ - 8
  • ఓఎల్​ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్ - 2
  • పీఆర్​ జూనియర్ ఫీల్డ్​ ఆఫీసర్​ - 4
  • ఆర్కిటెక్చర్​ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్​ - 4

విద్యార్హతలు
SJVN Job Qualification :

  • ఇంజినీరింగ్​ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆయా పోస్టులకు అనుగుణంగా ఇంజినీరింగ్​, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • హెచ్​ఆర్​ పోస్టులకు పోస్ట్​ గ్రాడ్యుయేషన్​/ డిప్లొమా ఇన్​ పర్సనల్ మేనేజ్​మెంట్​/ సోషల్ వర్క్/ లేబర్ వెల్ఫేర్​/ బిజినెస్ మేనేజ్​మెంట్​/ ఆఫీస్ మేనేజ్​మెంట్​/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​ క్వాలిఫై అయ్యుండాలి.
  • ఎఫ్​ & ఏ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ ఐసీడబ్ల్యూఏ-సీఎంఏ/ ఎం.కామ్​ చేసి ఉండాలి.
  • పీఆర్​ పోస్టులకు జర్నలిజం/ పబ్లిక్ రిలేషన్స్​/ మాస్​ కమ్యునికేషన్ డిగ్రీ చేసి ఉండాలి.
  • ఆర్కిటెక్టర్ పోస్టులకు ఫుల్​టైమ్​ ఆర్కిటెక్టర్​ డిప్లొమా చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి
SJVN Job Age Limit : అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి మినహాయింపులు వర్తిస్తాయి.

జీతభత్యాలు
SJVN Job Salary : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000 చొప్పున జీతం అందిస్తారు. దీనితో పాటు అదనంగా అనేక బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

ఎంపిక విధానం
SJVN Job Selection Process : అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్​ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. కంప్యూటర్​ బేస్డ్ టెస్ట్​లో సంబంధిత విభాగాలకు సంబంధించి 70 మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలు ఇస్తారు. అలాగే 30 జనరల్ ఆప్టిట్యూడ్​ ప్రశ్నలు అడుగుతారు. క్వాలిఫయింగ్ మార్కుల విషయానికి వస్తే.. జనరల్​, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేయడం ఎలా?
SJVN Job Online Apply Process :

  • అభ్యర్థులు ముందుగా www.sjvn.nic.in వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. ముఖ్యంగా మీ అఫీషియల్​ ఈ-మెయిల్ ఐడీని ఇవ్వాలి.
  • మీ మెయిల్​కు.. అప్లికేషన్​ సీక్వెన్స్ నంబర్​, యూజర్ ఐడీ, పాస్​వర్డ్​ సహా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కంపెనీ పంపిస్తుంది.
  • యూజర్ లాగిన్ డీటైల్స్ ఉపయోగించి, మీ యూజర్ సెక్షన్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫీజును ఆన్​లైన్​లో చెల్లించాలి. అయితే దీనిని మరలా రిఫండ్ చేయరు.
  • చివరిగా మీ అప్లికేషన్​లోని వివరాలు అన్నింటినీ చెక్​ చేసుకుని, దానిని సబ్​మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SJVN Job Online Apply Last Date : దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్​ 9

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.