కేరళ కొజికోడ్లోని ఉన్నికుళంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితురాలి కుటుంబానికి తెలిసిన వ్యక్తే... బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో బాధితురాలు సహా ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు ఓ క్వారీలో పని చేస్తున్నారని చెప్పారు.
ఈ దుర్ఘటనతో బాలిక ఆరోగ్యం క్షిణించగా కొజికోడ్ వైద్య కళాశాలలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: 'రాముడి జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి'