ఉత్తర్ప్రదేశ్లో వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. ఆరేళ్ల బాలికపై 25ఏళ్ల యువకుడు అత్యాచారం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
మధ్యాహ్నం వేళ ఇంటివద్ద ఓ చిన్నారి ఆటలాడుతుండగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. అయితే.. మానసిక వికలాంగుడిగా చెబుతున్న నిందితుణ్ని అరెస్ట్ చేసినట్టు కొత్వాలి పోలీసు అధికారి తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితునిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఇదీ చదవండి:'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'