ETV Bharat / bharat

ఆటోను 100మీటర్లు లాగిన ఆరేళ్ల చిన్నారి

author img

By

Published : Mar 20, 2021, 7:31 PM IST

తమిళనాడులో ఓటింగ్​పై అవగాహన కోసం సాహసం చేసింది ఓ ఆరేళ్ల చిన్నారి. స్కేటింగ్​ రోలర్​ ధరించి, ఆటోను 100 మీటర్లు లాగింది. ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

Six year old girl pulls auto by wearing skate roller urging 100 percent voting
ఆటోను లాగి ఆశ్చర్యపరిచిన ఆరేళ్ల చిన్నారి!
ఓటింగ్​పై అవగాహన- ఆటోను లాగిన ఆరేళ్ల చిన్నారి

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాట.. ప్రజలంతా ఓటింగ్​లో పాల్గొనాలని కోరుతూ ఓ ఆరేళ్ల బాలిక సాహసం చేసింది. స్కేటింగ్​ రోలర్​పై నిల్చుని, ఆటోను లాగి ఔరా అనిపించింది.

Six year old girl pulls auto by wearing skate roller urging 100 percent voting
తమిళనాడులో ఆటోను లాగిన ఆరేళ్ల చిన్నారి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా.. అందరూ ఓటింగ్​లో పాల్గొనాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా.. రవీనా అనే ఆరేళ్ల చిన్నారి.. తనవంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

స్కేటింగ్​ రోలర్​ ధరించి, ఆటోను లాగుతున్న రవీనా

100 మీటర్లు లాగి..

స్కేటింగ్​ రోలర్ కాళ్లకు ధరించిన రవీనా.. తాడుతో కట్టి ఉన్న ఆటోను 100 మీటర్లు లాగింది. తూత్తుకుడి కోవిల్​పట్టిలోని శెన్​బాగవల్లి అమ్మన్​ మందిరం సమీపంలోని ప్రాంతం ఈ సాహస కృత్యానికి వేదిక అయింది. ఆటోను రవీనా లాగుతున్నప్పుడు చప్పట్లతో స్థానికులు ప్రోత్సహించారు. కోవిల్​పట్టి డీఎస్పీ కాలాయ్​ కాతిరావన్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఆటోను లాగుతుండగా.. వీడియోలు చిత్రీకరిస్తున్న స్థానికులు

ఇదీ చూడండి:13 గంటల్లో 30 కిలోమీటర్లు ఈది మహిళ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.