ETV Bharat / bharat

మైనర్​పై గ్యాంగ్​రేప్​.. ఆరుగురికి జీవిత ఖైదు - అత్తమామల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య

six persons life imprisonment: బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురికి జీవిత ఖైదు విధించింది ఝార్ఖండ్​లోని లోహర్దగా జిల్లా ప్రత్యేక న్యాయస్థానం. దీంతోపాటు నిందితులకు రూ.20,000 జరిమానా విధించింది. మరోవైపు ఐదేళ్ల బాలికకు చాక్లెట్ ఆశచూపి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

six persons life imprisonment
జీవిత ఖైదు
author img

By

Published : May 1, 2022, 8:54 AM IST

six persons life imprisonment: ఝార్ఖండ్​లోని లోహర్దగా జిల్లా సెషన్స్​ కోర్టు(పోక్సో).. సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానాను విధించింది. 2020లో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడం వల్ల న్యాయమూర్తి అఖిలేశ్ కుమార్​ తివారీ ఈ తీర్పును శనివారం వెలువరించారు.

ప్రధాన నిందితుడు సుమిత్ అలియాస్ టైగర్ ఓరాన్ తన పుట్టిన రోజు పార్టీకి.. బాధితురాలిని పిలిచి తన ఐదుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన 2020 సెప్టెంబర్ 20న జరిగిందని పోలీసులు తెలిపారు. భండారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్‌గాయ్ గ్రామంలో ఈ దారుణానికి నిందితులు పాల్పడ్డారని వెల్లడించారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా తాజాగా న్యాయస్థానం వీరికి జీవిత ఖైదు విధించింది.

చాక్లెట్ ఆశచూపి..: ఐదేళ్ల బాలిక​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాజనందగావ్​లో జరిగింది. 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఆడుకుంటున్న సమయంలో నిందితుడు ఆమెకు చాక్లెట్​ ఆశచూపి.. తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు అరవడం వల్ల అప్రమత్తమైన ఆమె తల్లి.. నిందితుడి ఇంటికి వెళ్లి ఆమెను రక్షించింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టు ముందు పోలీసులు హాజరుపరచగా.. జువైనల్​ హోమ్​కు పంపాలని ఆదేశించింది.

కోర్టు ఆరో అంతస్తు నుంచి దూకి: అత్యాచార నిందితుడు కోర్టు భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్​ కోర్టులో జరిగింది. మృతుడు 21 ఏళ్ల సూరజ్​గా పోలీసులు గుర్తించారు. అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల వేధింపుల వల్లే సూరజ్​ చనిపోయాడని అన్నారు మృతుని తల్లిదండ్రులు. బాధితురాలి తల్లిదండ్రులు కొంతకాలంగా డబ్బులు ఇవ్వమని సూరజ్​ను వేధిస్తున్నారని అతని తల్లిదండ్రులు అరోపించారు. అందువల్లే తమ కుమారుడు కలత చెంది ఇలా చేశాడని ఆరోపించారు. అత్యాచార బాధితులిని.. తమ కుమారుడు పెళ్లి చేసుకున్నాడని అయిన వారి వేధింపులు తగ్గలేదని వాపోయారు.

సూరజ్‌ స్వస్థలం గాజియాబాద్​. ఆయన ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసేవాడు. గతేడాది జూన్‌ 15న ఖేరీ పుల్‌లో అత్యాచారం కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గతేడాది ఆగష్టులోనే మధ్యంతర బెయిల్​ను పొందాడు. సాధారణ బెయిల్ పిటిషన్ విచారణకు హాజరయ్యేందుకు శనివారం కోర్టుకు వచ్చాడని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. పోస్టుమార్టం అనంతర సూరజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: సెక్యూరిటీ గార్డును చెట్టుకు వేలాడదీసి.. ఇనుప రాడ్లతో దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.