ETV Bharat / bharat

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతి - జోరమ్‌ తంగా

assam-Mizoram border tensions
అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణ
author img

By

Published : Jul 26, 2021, 7:51 PM IST

Updated : Jul 26, 2021, 11:03 PM IST

19:48 July 26

సరిహద్దు ఘర్షణ

హింసాత్మకంగా మారిన అసోం, మిజోరం సరిహద్దు వివాదం

ఈశాన్య భారతంలో సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. మిజోరం వైపు నుంచి జరిగిన కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మరణించినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌ చేశారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరవబోమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడం వల్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్రమత్తమయ్యారు. అసోం, మిజోరం ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆక్రమణే కారణమా?

అంతకుముందు.. అసోం మిజోరాం సరిహద్దులోని లైలాపూర్ వద్ద జరిగిన ఘర్షణల్లో 8 మంది రైతులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మిజోరాం వైపు నుంచి కొంతమంది అసోం పరిధిలోని ప్రాంతాలను ఆక్రమించేందుకు రావడం వల్ల ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. కర్రలు, రాళ్ళు చేతబట్టిన బృందం.. అసోం పోలీసులపై దాడి చేసిందని.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్ప వాయుగోళాలు ప్రయోగించాల్సి వచ్చిందని సమాచారం. అసోం పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌ తంగా ఆరోపించగా.. మిజోరాం దుండగులు.. అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి చేశారని అసోం పోలీసులు తెలిపారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాలని.. మంత్రి పియూష్‌ హజరికాను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. ఘర్షణల తరువాత అసోం మిజోరాం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

గ్రామస్థుల వద్ద తుపాకులు..

సరిహద్దు గ్రామమైన వైరెంగ్టేకు చెందిన రైతుల గుడిసెలను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు తగలబెట్టారని.. మిజోరాం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ లాల్బియాక్తాంగా ఖియాంగ్టే తెలిపారు. అసోం సరిహద్దు గ్రామాల ప్రజల వద్ద కర్రలు, రాడ్లు, తుపాకులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించిన ఓ వీడియోను మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌ తంగా ట్వీట్‌ చేశారు. అమిత్‌ షా జీ.. దీనిని తక్షణమే అడ్డుకోవాలని ట్వీటర్‌ వేదికగా కోరారు. అసోం పౌరులతో పాటు రెండు కంపెనీల పోలీసు బృందాలు.. మిజోరం వైపు ఉన్న ప్రజలు, వాహనదారులపై దాడి చేశాయని ఆరోపించారు. పోలీసు అధికారులపై కూడా దాడి చేశారని జోరమ్‌తంగా ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.

శాంతి నెలకొల్పే యత్నం..

జోరమ్‌తంగా ట్వీట్‌పై స్పందించిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. జోరమ్‌తంగా జీ.. మిజోరం ప్రజలు కర్రలు పట్టుకుని హింసను ఎందుకు ప్రేరేపిస్తున్నారో దర్యాప్తు చేయించగలరా అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. శాంతి భద్రతలను ప్రజలు చేతుల్లోకి తీసుకోకూడదని కోరుతున్నామన్న ఆయన.. రెండు ప్రభుత్వాల మధ్య శాంతియుతమైన చర్చల జరగాలని కోరుకుంటున్నామన్నారు. తాను సీఎం పదవి నుంచి వైదొలగాలని.. అప్పటివరకు తమ ప్రజలు హింసను ఆపరని మిజోరంలోని కోలసిబ్ జిల్లా SP కోరుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా నడపగలమని హిమంత ప్రశ్నించారు. మిజోరం సీఎంతో తాను మాట్లాడినట్లు తెలిపిన హిమంత.. అసోం సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పెందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే దీనిపై మిజోరం సీఎంతో చర్చిస్తామన్నారు.

అయితే అసోం పోలీసులే తొలుత దాడికి తెగబడ్డారని అన్నారు మిజోరాం హోంమంత్రి లాల్​ చమ్లియానా.

"ఐజీ నేతృత్వంలో 200 మంది అసోం సాయుధ పోలీసులు వైరెంగ్టేలోని ఆటో స్టాండ్​కు వచ్చారు. అక్కడ ఉన్న సీఆర్​పీఎఫ్​ బలగాలను అధిగమించి బలవంతంగా డ్యూటీ పోస్టు దాటారు. నిరాయుధులైన ప్రజలపై లాఠీఛార్జి చేశారు. మిజోరాం పోలీసులపై కాల్పులు జరిపి, టియర్​ గ్యాస్ గ్రెనేడ్లు విసిరారు. దీనికి వెంటనే మిజోరాం పోలీసులు బదులుచెప్పారు. అసోం అధికారులతో కొలాసిబ్ ఎస్​పీ ఓ వైపు చర్చలు జరుపుతుండగానే ఈ దాడులు జరిగాయి."

-మిజోరాం హోంమంత్రి లాల్​చమ్లియానా

సరిహద్దుకు సీఆర్​పీఎఫ్​ బలగాలు..

లైలాపూర్‌, వైరెంగ్టే సరిహద్దు ప్రాంతానికి రెండు కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు తరలించినట్లు సీఆర్​పీఎఫ్​ ఏడీజీ సంజీవ్ రంజన్ ఓజా తెలిపారు. దాడి జరిగే సమయంలో బలగాలు అక్కడే ఉన్నా ఎవరి పక్షాన నిలవకుండా తటస్థంగా వ్యవహరించాయని చెప్పారు. వివాదాస్పద ప్రాంతం నుంచి అసోం పోలీసులు పూర్తిగా వైదొలిగారని, కొలాసిబ్ ఎస్​పీ నేతృత్వంలోని మిజోరాం పోలీసులు మాత్రం అక్కడే బైఠాయించారని వెల్లడించారు.

బ్రిటిషర్స్​ లాగా..

ఈ దాడుల్లో 80మందికి పైగా గాయపడ్డారని తెలిపిన అసోం మంత్రి పరిమల్ సుక్లబైద్య.. మిజోరాం తరపువారు జలియన్​వాలా బాగ్​లో బ్రిటిషర్స్​ తరహాలో కాల్పులకు తెగబడ్డారని విమర్శించారు.

అసోం, మిజోరాం రాష్ట్రాలకు మధ్య 164 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఆగస్టు 2020లో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చూడండి: రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్తత - 8 మందికి గాయాలు

Last Updated : Jul 26, 2021, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.