ETV Bharat / bharat

బొగ్గు గనిలో ప్రమాదం- ఆరుగురు కార్మికులు మృతి! - mine accident news latest

మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అసోంకు చెందిన ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Six feared dead in yet another mine accident tragedy in Meghalaya
బొగ్గు గనిలో ప్రమాదం
author img

By

Published : Jun 1, 2021, 9:39 AM IST

మేఘాలయ తూర్పు జైంతియా హిల్స్​ జిల్లా ఖ్లెహరియత్​లోని ఓ గనిలో వరదల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అసోంకు చెందిన ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అసోం కాఛార్ జిల్లా పోలీసులకు తెలియజేసినట్లు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. వరదల్లో గల్లంతైన వీరి ఆచూకీ కోసం సహాయక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.

గనిలో డైనమైట్ అకస్మాత్తుగా పేలడం వల్ల ఒక్కసారిగా నీటి ప్రవాహం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కొందరు కార్మికులు లోపలే చిక్కుకున్నట్లు చెప్పారు.

ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని కార్మికులను బెదిరించిన సూపర్​వైజర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.