ETV Bharat / bharat

చెరువులో స్నానానికి దిగి.. ఆరుగురు చిన్నారులు మృతి - నీటమునిగి ఆరు చిన్నారులు మరణం

హరియాణాలో ఘోరం జరిగింది. స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు చెరువులో మునిగి మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు.. చిన్నారుల మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు.

Six children drown
చెరువులో మునిగి ఆరుగురు మృతి
author img

By

Published : Oct 9, 2022, 10:19 PM IST

Updated : Oct 9, 2022, 10:54 PM IST

హరియాణా.. గురుగ్రామ్​లోని శంకర్​విహార్​లో ఆరుగురు చిన్నారులు చెరువులో మునిగి మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని చెరువు నిండిందని.. అందులో స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. మృతులందరూ 8 నుంచి 13 ఏళ్ల వయసువారేనని వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు నాలుగు గంటలపాటు శ్రమించి ఆరుగురి మృతదేహాలు బయటకు తీసినట్లు పోలీసులు వెల్లడించారు.

Six children drown
చిన్నారుల దుస్తులు

శంకర్‌విహార్‌ కాలనీకి చెందిన దుర్గేశ్, అజిత్‌, రాహుల్‌, పీయూశ్, దేవా, వరుణ్‌లను మృతులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ తెలిపారు. చిన్నారుల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకేసారి ఆరుగురు చిన్నారులు మరణించడం వల్ల స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

సందర్శనకు వచ్చి..
హరియాణా ధనౌరీలోని సాబిర్ పాక్ దర్గాను సందర్శించడానికి వచ్చిన ముగ్గురు యాత్రికులు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కుంటలో స్నానం చేయడానికి వెళ్లి మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతుల్లో చిన్నారి సహా, ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వీరంతా ఉత్తర్​ప్రదేశ్​కు చెందినవారని సమాచారం.

ఇవీ చదవండి: జాలర్ల కిడ్నాప్​కు పాక్‌ యత్నం.. ఆపై కాపాడామంటూ కట్టుకథ.. కేసు నమోదు

'శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం.. 40 శాతం పనులు పూర్తి'

Last Updated : Oct 9, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.