ETV Bharat / bharat

చావులోనూ కలిసే.. అన్న మరణం తట్టుకోలేక గుండెపోటుతో చెల్లి... - అన్న మరణం తట్టుకోలేక చెల్లి మృతి

Sister dies with heart attack: కర్ణాటకలోని మైసూరులో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సోదరుడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక గుండెపోటుతో ఓ యువతి మృతిచెందింది.

Sister dies with heart attack
అన్న మరణాన్ని తట్టుకోలేక
author img

By

Published : Jan 12, 2022, 5:04 PM IST

Updated : Jan 12, 2022, 7:56 PM IST

అన్న మరణం తట్టుకోలేక గుండెపోటుతో చెల్లి మృతి

Sister dies with heart attack: తోడపుట్టిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ యువతి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తోడుగా ఉండే అన్న.. ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. తల్లిదండ్రులతో పాటు అన్న మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆమె.. అక్కడే గుండెపోటుతో మృతిచెందింది.

ఇదీ జరిగింది..

కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నాపేట్​కు చెందిన మంజునాథ్​, రత్న దంపతులకు కీర్తిరాజ్​, రష్మీ సంతానం. మైసూరులోని ప్రభుత్వ కళాశాలలో బీకామ్​ రెండో సంవత్సరం చదువుతోంది రష్మీ. సోమవారం రాత్రి.. మైసూరు-మంగళూరు హైవే వద్ద హునసూర్​ తాలుక పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కీర్తిరాజ్​ దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకుని తల్లిదండ్రులు హుటాహుటిన హునసూర్​ ఆసుపత్రికి చేరుకున్నారు.

అన్న మరణ వార్త విని చెల్లెలు రష్మీ కూడా హునసూర్​ ఆసుపత్రికి వచ్చింది. అన్న విగత జీవిగా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. అక్కడిక్కడే కుప్పకూలింది. తల్లిదండ్రులు ఆమెను వైద్యులకు చూపించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. గుండెపోటే రష్మీ మృతికి కారణమని తెలిసింది.

Sister dies with heart attack
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కీర్తిరాజ్​
Sister dies with heart attack
గుండెపోటుతో మృతిచెందిన రష్మీ

కొడుకు పోయాడని అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు.. కుమార్తె అనూహ్య మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి : నాన్నపై గ్రామసభలో కుమారుడి ఫిర్యాదు- మద్యం తాగరాదని తీర్పు!

Last Updated : Jan 12, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.