ETV Bharat / bharat

'దిల్లీకి ఆక్సిజన్​ 700 ఎంటీకి తగ్గకుండా చూడండి' - దిల్లీకి ఆక్సిజన్ సరఫరాపై కేంద్రానికి లేఖ రాసిన మనీశ్ సిసోదియా

దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి మనీశ్​​ సిసోడియా కేంద్రాన్ని కోరారు. గత రెండు రోజులుగా నగరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిందన్నారు.

Delhi Deputy Chief Minister Manish Sisodia
మనీశ్ సిసోదియా
author img

By

Published : May 8, 2021, 4:45 PM IST

దిల్లీలో కరోనా చికిత్స పొందుతున్న రోగులకు ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా. మే 5న తొలిసారిగా 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపిన సందర్భంగా.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సరఫరా తగ్గిందని.. గతంలో ఇచ్చిన మోతాదును కొనసాగించాలని కోరారు.

"మే 5వ తేదీన 730 మెట్రిక్ టన్నుల(ఎంటీ) ఆక్సిజన్ పంపినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. దానిని కొనసాగించాలని కోరుతున్నాం. మే 6న 577ఎంటీ, మే 7న 487 మెట్రిక్ టన్నులకు సరఫరా పడిపోయింది. 700 ఎంటీ కన్నా తక్కువ సరఫరా ఉంటే మాత్రం ఆసుపత్రులను నిర్వహించడం మాకు చాలా కష్టం"

-మనీశ్​​ సిసోడియా

కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం దిల్లీ ప్రభుత్వానికి సహకరిస్తుందని.. ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: 'దిల్లీలో నాలుగో వేవ్‌.. లాక్‌డౌన్‌ ఆలోచన లేదు!'

'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళనకరం'

'దిల్లీ డిప్యూటీ సీఎంను చంపడానికే భాజపా కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.