హరియాణాలోని సిర్సా మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఆందోళనలు చెలరేగాయి. సిర్సా భాజపా ఎంపీ సునితా దుగ్గల్, ఎమ్మెల్యే గోపాల్ కందా.. ఓటేసేందుకు సిర్సా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున కార్యాలయంవైపు వచ్చారు. ఎంపీ సునితా దుగ్గల్, ఎమ్మెల్యే గోపాల్ కందాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను భారీగా మోహరించినా.. రైతులు పట్టుబిగించి కార్యాలయంలోకి వచ్చే యత్నం చేశారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు వారిపై పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు.
రెండున్నర సంవత్సరాల తర్వాత సిర్సా మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్నికలు జరగుతున్నాయి.