పంజాబ్ కాంగ్రెస్(punjab congress) అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి.. రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేశారు(punjab congress crisis) నవజ్యోత్ సింగ్ సిద్ధూ. మంత్రివర్గ కూర్పు సహా పలు అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన డిమాండ్లను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆయనను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ.. సిద్ధూతో(Navjot Sidhu news) మూడు రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ తర్వాత తనకు ఎలాంటి పదవి లేకపోయినా.. గాంధీల వెంటే ఉంటానని ప్రకటించిన సిద్ధూ.. డిమాండ్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.
తాజాగా మరోమారు తన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ట్వీట్ చేశారు సిద్ధూ(navjot sidhu tweet). సోమవారం మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో సిద్ధూ ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకోనున్నారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పంజాబ్ పోలీస్ చీఫ్, అడ్వకేట్ జనరల్‌ను మార్చాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు సిద్ధూ. లేకపోతే రాష్ట్రంలో అధికార పార్టీ.. ప్రజలకు ముఖం చూపించుకోలేదని స్పష్టం చేశారు.
"దైవదూషణ కేసుల్లో న్యాయం చేయాలని, 2017లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత సీఎం వైఫల్యం కారణంగా ఆయన్ను ప్రజలు తొలగించారు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నియామకాలు.. బాధితుల గాయాలపై కారం చల్లుతున్నాయి. వారిని తప్పనిసరిగా మార్చాలి. లేకపోతే మనం ప్రజలకు ముఖం చూపించలేం."
- నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత.
మొరిందాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ(charanjit singh channi news) హాజరుకాగా.. సిద్ధూ డిమాండ్లపై విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వకుండా.. 'పూర్తి స్థాయి డీజీపీని ఇంకా నియమించలేదు' అని తెలిపారు ముఖ్యమంత్రి
" ఈ విషయంపై సిద్ధూతో మాట్లాడాను. డీజీపీగా బాధ్యతలు అప్పగించేందుకు 30 ఏళ్లకుపైగా సర్వీసు ఉన్న 10 మంది అధికారుల పేర్లను కేంద్రానికి పంపించామని సిద్ధూకు తెలుసు. ముగ్గురి పేర్లను కేంద్రం మాకు సూచిస్తుంది. అందులో నుంచి ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. మా ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ, నిజాయితీగా పని చేస్తుంది. పార్టీ పనులను సిద్ధూ చూసుకుంటున్నారు. ఇద్దరం సమన్వయంతో పని చేస్తున్నాం."
- చరణ్‌జీత్ సింగ్ చన్నీ, పంజాబ్ ముఖ్యమంత్రి.
పంజాబ్ పీసీసీ చీఫ్‌గా రాజీనామా చేసిన సిద్ధూ.. డీజీపీ, అడ్వకేట్ జనరల్ నియామకాలు, అవినీతి మరకలు ఉన్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. డీజీపీగా ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాను తొలగించాలని, ఆయన 2015లో దైవదూషణ కేసులపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహించి బాదల్ కుటుంబానికి క్లీన్చిట్ ఇచ్చారని, ఇద్దరు సిక్కులను అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు సిద్ధూ. 2015లో పోలీసుల కాల్పుల ఘటనలో అప్పటి డీజీపీ సుమేధ్ సింగ్ సైనీకి ఏఎస్ దేఓల్ న్యాయవాదిగా పని చేశారని, ప్రస్తుతం ఆయన్ని అడ్వకేట్ జనరల్‌గా నియమించటం సరికాదని వాదిస్తున్నారు.
ఇదీ చూడండి: Sidhu news: 'వ్యక్తిగతంగా ఎవరిపైనా వైరం లేదు.. ప్రజల కోసమే'
సిద్ధూతో చన్నీ భేటీ.. పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితులను గమనిస్తున్న రావత్