ETV Bharat / bharat

'శ్రద్ధను నేనే చంపా.. పోలీసులకు చెప్పినవన్నీ నిజాలే'.. కోర్టు ముందు అఫ్తాబ్ - దిల్లీ హత్య న్యూస్

శ్రద్ధా వాకర్‌ను క్షణికావేశంలో హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తున్నట్లు తెలిపారు. అఫ్తాబ్‌కు పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగించింది. అతడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.

shraddha-walkar-case
shraddha-walkar-case
author img

By

Published : Nov 22, 2022, 2:31 PM IST

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాను దిల్లీ పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చారు. క్షణికావేశంలోనే తాను శ్రద్ధాను హత్య చేసినట్లు నిందితుడు న్యాయస్థానం ముందు అంగీకరించాడు. ఈ ఘటన జరిగి చాలా రోజులు అయినందున తనకు చాలా విషయాలు గుర్తుకు రావడం లేదని అఫ్తాబ్‌ చెప్పాడు.

ఈ కేసులో అఫ్తాబ్‌కు విధించిన ఐదు రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో.. మంగళవారం అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాకేత్‌ కోర్టు ముందు హాజరుపర్చారు. శ్రద్ధాను హత్య చేసింది తానే అని అంగీకరించిన అఫ్తాబ్‌ అదంతా ఘర్షణ వాతావరణంతో క్షణికావేశంలో జరిగిందన్నాడు. కేసు దర్యాప్తు కోసం పోలీసులకు సహకరిస్తున్నట్లు తెలిపాడు. శ్రద్ధా శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పినట్లు వెల్లడించాడు. తాను చెప్పేవన్నీ నిజాలేనని, పోలీసులను తప్పుదోవ పట్టించడం లేదని అన్నాడు. ఘటన జరిగి నెలలు గడిచినందున చాలా విషయాలు తనకు గుర్తు రావట్లేదని అఫ్తాబ్‌ కోర్టుకు తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతడి పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగించింది.

అఫ్తాబ్‌ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీని తర్వాత నార్కో ఎనాలసిస్‌ పరీక్ష కూడా జరపనున్నారు. ఈ రెండు పరీక్షలను నిర్వహించేందుకు నిందితుడు అంగీకరించాడని.. పది రోజుల్లో వీటిని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. కోర్టు కూడా అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌ పరీక్ష చేయడానికి దిల్లీ పోలీసులకు అనుమతినిచ్చింది. పాలిగ్రాఫ్‌ టెస్టులో ఎలాంటి ఔషధాన్ని వాడరు. ఒక మెషీన్‌కు అఫ్తాబ్‌ను అనుసంధానించి ప్రశ్నలు అడుగుతారు. అఫ్తాబ్‌ హృదయ స్పందన రేటు, రక్తపోటు, శ్వాసక్రియ, చర్మ వాహకత ద్వారా అతడు చెప్పినవి నిజాలో కావో తెలుసుకుంటారు.

హత్య అనంతరం శ్రద్ధ శరీరభాగాలను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన రంపం, బ్లేడ్‌ను గురుగ్రామ్‌లోని అటవీప్రాంతంలో పడేసినట్లు అఫ్తాబ్‌ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మరో కత్తిని మెహ్‌రౌలీలోని చెత్తకుప్పలో విసిరేసినట్లు చెప్పాడని దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ఆయుధాల కోసం గురుగ్రామ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు రెండుసార్లు వెతికినా అవి దొరకలేదు. దీంతో నిందితుడు చెబుతున్న విషయాలు నిజమా? కాదా? అన్నది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.

'సీబీఐకి ఎందుకివ్వాలి?'
మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీన్ని పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యంగా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును ఎందుకు సీబీఐకి బదిలీ చేయాలనే విషయంపై ఒక్క కారణాన్నీ పిటిషనర్ సరిగా వివరించలేదని పేర్కొంది. ఆధారాలు సేకరించే సమయంలో పోలీసుల వెంట ప్రజలు, మీడియా ఉండటం సరికాదని పిటిషనర్ జోషిణీ తులి తరఫున హాజరైన న్యాయవాది పేర్కొన్నారు. ఇది ఆధారాల ధ్వంసానికి దారితీస్తుందని వాదించారు. ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. పోలీసుల విచారణపై అనుమానాలు అవసరం లేదని పేర్కొంది. 'బాధితురాలి తల్లిదండ్రులకే ఎలాంటి అభ్యంతరం లేదు. మీరెవరో అపరిచితులు. ఏదో కారణం వల్లే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది పబ్లిసిటీ లిటిగేషన్' అని కోర్టు వ్యాఖ్యానించింది.

టీవీ యాక్టర్ రియాక్షన్
ఇదిలా ఉండగా.. ముంబయికి చెందిన టీవీ నటుడు ఇమ్రాన్ నజీర్ ఖాన్.. శ్రద్ధా వాకర్ హత్యపై కీలక విషయాలు వెల్లడించారు. శ్రద్ధతో తనకు పరిచయం ఉందని చెప్పిన ఇమ్రాన్.. అఫ్తాబ్​కు ఉన్న డ్రగ్స్ వ్యసనం గురించి తనతో చెప్పిందన్నారు. అఫ్తాబ్​ను డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేలా చేసేందుకు సహాయం కోరిందని చెప్పారు. ఇన్నిరోజులు తాను ముంబయిలో లేనని, శ్రద్ధ హత్య విషయం గురించి ఇప్పుడే తెలిసిందని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.

Imran Nazir Khan
ఇమ్రాన్ నజీర్ ఖాన్

"శ్రద్ధ నాకు తెలుసు. 2021 ఫిబ్రవరిలో నాతో మాట్లాడింది. నరకంలో బతుకుతున్నా అంటూ చెప్పింది. తన బాయ్​ఫ్రెండ్ డ్రగ్స్​కు బానిస అయ్యాడని, రెండు-మూడేళ్ల నుంచి మాదకద్రవ్యాలు తీసుకుంటున్నాడని చెప్పింది. అఫ్తాబ్​ కోసం రిహాబిలిటేషన్ సెంటర్ గురించి వివరాలు అడిగింది. అతడి చికిత్స కోసం సాయం కోరింది. డ్రగ్స్​ వ్యసనం నుంచి బయటపడేందుకు చాలా మందికి నేను సహాయం చేశా.. కాబట్టి శ్రద్ధ నా సహాయం కోరింది. కానీ ఆమె ముంబయి నుంచి దిల్లీ వెళ్లిపోయాక నన్ను సంప్రదించలేదు" అని ఇమ్రాన్ పేర్కొన్నారు.
గఠ్​బంధన్, అలాద్దీన్, మరియం ఖాన్ రిపోర్టింగ్ లైవ్, హమారి బహు సిల్క్, మేడమ్ సర్ అనే పలు సీరియల్స్, షోలలో ఇమ్రాన్ కనిపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ చిన్నచిన్న పాత్రలు పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.