ETV Bharat / bharat

శ్రద్ధ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్.. సాక్ష్యాధారాలు లభించేనా? - aftab narco test

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు అఫ్తాబ్​ను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది దిల్లీ కోర్టు. నిందితుడికి నార్కో పరీక్షలు జరిపేందుకు అనుమతిచ్చింది. అయితే నిందితుడిని దోషిగా నిరూపించడానికి పోలీసుల వద్ద ఉన్న ఆధారాలేంటి? మర్డర్​ జరిగి ఆరు నెలలు గడిచిపోయింది, ఎలా ఆధారాలు సేకరిస్తారు? ఇంకా దొరకాల్సినవి ఏంటి? అనే ప్రశ్నలను పోలీసులు ఎలా ఛేదిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

shraddha murder case
shraddha murder case
author img

By

Published : Nov 17, 2022, 5:57 PM IST

Updated : Nov 17, 2022, 7:14 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్​ హత్య కేసులో మరిన్ని నిజానిజాలు బయటపెట్టేలా కీలక ముందడుగు పడింది. తాజాగా ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్​ను మరింత లోతుగా విచారించడానికి నార్కో అనాలసిస్​ టెస్ట్​ నిర్వహించడానికి అనుమతిచ్చింది దిల్లీ కోర్టు. అఫ్తాబ్​ను మరో ఐదురోజులు పోలీసుల కస్టడీకి గురువారం అప్పగించింది. ఈ మేరకు పోలీసులు వేసిన వ్యాజ్యంపై మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ అవిరాల్ శుక్లా సానుకూలంగా స్పందించారు.
మరో వైపు నిందితుడికి మరణ శిక్ష విధించాలని నినాదాలు దాదాపు 100 మంది లాయర్లు దిల్లీ కోర్టు ముందు నిరసనకు దిగారు. ఈ కేసు ఫాస్ట్రాక్​ కోర్టులో విచారించాలని డిమాండ్​ చేశారు. నిందితుడికి మరణ శిక్ష విధించడానికి సరైన ఆధారాలు సేకరించడం పోలీసులు ముందున్న మరో సవాలు.

ప్రస్తుతం అతడ్ని శిక్షించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నార్కో టెస్టు అనంతరం నిందితుడి వద్ద నుంచి మరింత సమాచారం లభిస్తుంది. అయితే హత్య జరిగి ఆరు నెలలు గడిచిపోయినందున ఆధారాలను సేకరించడం పోలీసులకు కష్టతరంగా మారింది. హత్యకు ఉపయోగించిన కత్తి, శ్రద్ధ మొబైల్‌, ఇంకా కొన్ని శరీర భాగాలు లభ్యం కాలేదు. ప్రస్తుతం పోలీసుల దగ్గరున్న ఆధారాలేంటి?. ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యాలను దర్యాప్తు వర్గాలు సంపాదించాయా? ఇంకా దొరకాల్సినవి ఏంటి? అనే ప్రశ్నలకు దర్యాప్తు అధికారులు ఎలా సమాధానాలు వెతుకుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవే పోలీసుల ముందున్న సవాళ్లు..
దిల్లీలో శ్రద్ధా వాకర్‌ హత్యకు సంబంధించి, పోలీసులు ఆధారాలు సంపాదించే పనిలో పడ్డారు. నిందితుడ్ని శిక్షించాలంటే ఆధారాలు తప్పనిసరి కావడం వల్ల దర్యాప్తు వర్గాలు ప్రస్తుతం వాటిపై దృష్టి సారించాయి. హత్య జరిగి ఆరు నెలలు అయినందున సాక్ష్యాధారాలను సేకరించడం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారింది. శ్రద్ధను హత్యచేసి ముక్కులుగా కోసేందుకు వాడిన ఆయుధాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఒకవేళ దానిని స్వాధీనం చేసుకున్నా దానిపై రక్తపు మరకలు, వేలిముద్రలు గుర్తించడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. మృతి చెందిన సమయంలో శ్రద్ధా వేసుకున్న దుస్తులను కనుగొనాల్సి ఉంది. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ దుస్తులను నిందితుడు చెత్త వ్యాన్‌లో వేశాడు. ఇప్పుడు వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. మరో కీలక సాక్ష్యం మొబైల్‌ ఫోన్‌ కూడా పోలీసులకు దొరకలేదు. హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది అత్యంత కీలకం. లాగిన్‌ హిస్టరీని బట్టి ఆమె చివరగా ఉన్న ప్రదేశాన్ని కనుగొనేందుకు వీలవుతుంది.

తెలుసుకునే వీలుందా?
ముక్కలుగా కోసిన శ్రద్ధా శరీర అవయవాలను ఒక ఫ్రిజ్‌లో పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కానీ ఆ ఫ్రిడ్జ్‌ను హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌తో శుభ్రం చేసినట్లు తెలుస్తోంది. శ్రద్ధ డీఎన్‌ఏ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు అఫ్తాబ్‌ దానిని వాడాడు. ఇప్పుడు దీనినుంచి ఏదైనా ఆధారాన్ని సేకరించే వీలుందో లేదో ఇంకా స్పష్టత లేదు. అలాగే హత్యకుముందు వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని విచారణలో అఫ్తాబ్ వెల్లడించాడు. కానీ ఆ గొడవ గురించి పొరుగున ఉన్నవారు ఎవరూ వినలేదని తెలుస్తోంది. దాని గురించి ఎవరైనా సమాచారం వెల్లడిస్తే.. ఈ కేసుకు ఉపకరిస్తుంది. ఇక శ్రద్ధా శరీర అవయవాలను దిల్లీలోని అటవీ ప్రాంతంతో పాటు, పలు చోట్ల విసిరినట్లు అఫ్తాబ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అటవీ ప్రాంతంలో వెతగ్గా ఇప్పటివరకు 10కి పైగా ఛిద్రమైన భాగాలు దొరికాయి. మిగిలినవి పోలీసులు గుర్తించాల్సి ఉంది.

ఉన్న ఆధారాలివే..
శ్రద్ధ హత్యకు సంబంధించి దిల్లీ పోలీసులు కొన్ని ఆధారాలను సంపాదించారు. శరీర భాగాలు దాచేందుకు అఫ్తాబ్ ఫ్రిడ్జ్‌ కొనుగోలు చేయగా దానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను స్టోర్‌ నుంచి పోలీసులు తీసుకున్నారు. అఫ్తాబ్‌కు కత్తి అమ్మిన దుకాణదారుడి స్టేట్‌మెంట్‌ను సైతం దర్యాప్తు వర్గాలు భద్రపరిచాయి. హత్య చేసే క్రమంలో నిందితుడికి గాయం కాగా.. దానికి చికిత్స చేసిన వైద్యుడి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. అలాగే వంట గదిలో లభించిన రక్త నమూనాలను ఫోరెన్సిక్‌కు పంపిన అధికారులు, శ్రద్ధా ఖాతా నుంచి.. అఫ్తాబ్‌కు నగదు బదిలి అయిన స్టేట్‌మెంట్‌ను సంపాదించారు. వీటితోపాటు శ్రద్ధ కాల్‌ రికార్డ్స్‌, లొకేషన్‌ డేటా, బ్యాగ్‌, బాధితురాలి తండ్రి, స్నేహితుల వాంగ్మూలాలు పోలీసుల వద్ద ఉన్నాయి.

35 ముక్కలు కోసి.. మూడు వారాలు ఫ్రిడ్జ్​లో..
శ్రద్ధా వాకర్​ అనే యువతిని.. అఫ్తాబ్​ అనే యువకుడు అతికిరాతకంగా చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి మూడు వారాలకు పైగా ఫ్రిజ్​లో ఉంచాడు. ఆపై దిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఘటన దక్షిణ దిల్లీలోని మెహ్​రౌలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. అయితే ఈ జంట మధ్యలో తరచూ గొడవలు జరిగేవని.. అదే శ్రద్ధను చావుకు దారితీసిన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి : దొంగల ముఠా కోసం 20కి.మీ ఛేజ్.. మూకదాడిలో గాయపడి చిన్నారి మృతి

యువతి ముఖంపై మద్యం సీసాతో దాడి.. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని..

Last Updated : Nov 17, 2022, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.