ETV Bharat / bharat

మహిళపై పెట్రోల్​ పోసి సజీవదహనం.. ఆపై తానూ.. - తమిళనాడు

తనతో సహజీవనం చేస్తున్న మహిళ.. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో ఆమెను సజీవ దహనం చేశాడు ముత్తు అనే వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Shocking! Man sets fire to woman then set himself, duo dies hours later
నిద్రిస్తున్న మహిళకు నిప్పంటించిన వ్యక్తి.. ఇదే కారణం!
author img

By

Published : Apr 10, 2021, 6:10 PM IST

తమిళనాడులోని చెన్నైలో నిద్రిస్తున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. తనతో బంధంలో ఉండి, మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే కోపంతో ఈ చర్యకు పాల్పడ్డాడు ముత్తు అనే వ్యక్తి.

మహిళ సజీవ దహనం

ఏం జరిగిందంటే..

ముత్తు అనే కార్మికుడు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె సంరక్షణ సిబ్బందిగా పని చేసేది. వారిద్దరూ బస్​స్టేషన్​లలోని ఫ్లాట్​ఫాంపైనే నివసించేవారు. అయితే కోయంబెడు మార్కెట్​లో పనిచేసే మరో వ్యక్తితో శాంతి సన్నిహితంగా ఉంటోంది. అది ఇష్టం లేని ముత్తు.. అతడితో తెగదెంపులు చేసుకోవాలని ఆమెను ఆదేశించాడు. దానికి ఆమె అంగీకరించక పోవడం వల్ల కోపోద్రిక్తుడైన ముత్తు.. శాంతి నిద్రిస్తున్న సమయంలో పెట్రల్​ పోసి నిప్పంటించాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రయాణికులు, స్థానికులు ఆ మంటలను ఆర్పేసి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మహిళ ఆత్మహత్య- అత్తవారింటికి బంధువులు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.