ETV Bharat / bharat

భాజపాకు శివసేన 'ట్రంప్​' పంచ్​

భాజపా లక్ష్యంగా మరోమారు విమర్శనాస్త్రాలు సంధించింది శివసేన. ఆర్నబ్​ గోస్వామి అరెస్ట్​ నేపథ్యంలో నెలకొన్న వివాదాన్ని.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం ట్రంప్​ పరిస్థితితో పరోక్షంగా పోల్చి.. తన అధికార పత్రిక 'సామ్నా'లో ఓ కథనం ప్రచురించింది.

Shiv Sena invokes Trump to taunt BJP over Arnab's arrest
భాజపాకు శివసేన 'ట్రంప్​' పంచ్​
author img

By

Published : Nov 7, 2020, 4:17 PM IST

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్నబ్​ గోస్వామి అరెస్ట్​ వ్యవహారంపై భాజపా-శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా.. భాజపా లక్ష్యంగా తన అధికార పత్రిక సామ్నాలో విమర్శనాస్త్రాలు సంధించింది శివసేన. అర్నబ్​​ అరెస్ట్​ చుట్టూ నెలకొన్న హడావుడిని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో పోల్చింది.

"ఎన్నికల ఫలితాలపై ట్రంప్​ అసత్య వార్తలను వ్యాపింపజేస్తున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని డిమాండ్​ చేస్తున్నారు. అమెరికా ప్రతిష్ఠను పట్టించుకోకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ట్రంప్​ లాగే మహారాష్ట్రలో భాజపా నేతలు ప్రవర్తిస్తున్నారు. ఓ అత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్​కు వ్యతిరేకంగా నిరనసలు చేస్తున్నారు."

-- సామ్నా

53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఈ నెల 4వ తేదీన మహారాష్ట్ర పోలీసులు ఆర్నబ్​ను అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్​ అప్రజాస్వామికమని, దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భాజపా ఆరోపించింది. అర్నబ్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేసింది.

ఇదీ చూడండి:- ఓటర్ల సంకల్పం- ఓటేయడం కోసం బ్రిడ్జి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.