ETV Bharat / bharat

మమత కోసం శివసేన కీలక నిర్ణయం

బంగాల్ శాసనసభ​ ఎన్నికల్లో పోటీ చేయొద్దని శివసేన నిర్ణయించింది. మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Shiv Sena has decided not to contest West Bengal polls
బంగాల్​​ ఎన్నికలకు శివసేన దూరం.. దీదీకి మద్దతు!
author img

By

Published : Mar 4, 2021, 2:19 PM IST

బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శివసేన ప్రకటించింది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

దీదీకి అండగా..

బంగాల్​ శాసనసభ పోరులో శివసేన నిలుస్తుందా లేదా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సంజయ్​ రౌత్​ అన్నారు. అయితే దీనిపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామని​ వెల్లడించారు. బంగాల్​లో ప్రస్తుతం మమత ఒంటరి పోరాటం చేస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపారు.

మమత 'టైగర్​'..

బంగాల్​లో మమతకు వ్యతిరేకంగా అనేక కుట్రలు జరుగుతున్నాయని సంజయ్​ ఆరోపించారు. ఆంగ్ల అక్షరం 'ఎం'ను ఉటంకిస్తూ పరోక్షంగా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. మనీ (డబ్బు), మజిల్(అధికారం), మీడియాను మమతకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆమెకు మద్దతుగా నిలిచేందుకే ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయంతో గర్జించాలని ఆకాక్షించారు. ఆమెను 'బంగాల్ ​టైగర్' గా అభివర్ణించారు సంజయ్ రౌత్.

ఇదీ చదవండి: బంగాల్​ దంగల్: 'సొంత కుమార్తే కావాలి.. మేనత్త కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.