ETV Bharat / bharat

Shiv Sena Dispute Supreme Court : 'వారంలోగా నిర్ణయం తీసుకోవాలి'.. శిందే వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం - శివసేన గుర్తుపై సుప్రీం కోర్టు నిర్ణయం

Shiv Sena Dispute Supreme Court : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సహా ఆయన తరఫు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​ను సుప్రీం కోర్టు ఆదేశించింది.

supreme court verdict on shiv sena symbol
శివసేన గుర్తుపై సుప్రీం కోర్టు తీర్పుShiv Sena Symbol Supreme Court :
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 5:11 PM IST

Updated : Sep 18, 2023, 6:29 PM IST

Shiv Sena Dispute Supreme Court : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​కు సూచించింది సుప్రీం కోర్టు. అనర్హత పిటిషన్​ తీర్పు జాప్యంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీ.వై చంద్రచూఢ్​, జస్టిస్​ జే.బీ పార్దీవాలా, జస్టిస్​ మనోజ్​ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిర్ణీత కాలవ్యవధిలోగా అమలు చేసి.. న్యాయస్థానం పట్ల స్పీకర్​ గౌరవంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. శిందే వర్గం ఎమ్మెల్యేలను అనర్హలుగా ప్రకటించాలన్న ఉద్ధవ్​ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్​పై విచారణ సందర్భంగా సోమవారం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. కాగా, 2022 జూన్​లో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ.

అనర్హత పిటిషన్‌ల పరిష్కారానికి సభాపతి పరిధిలో ఉండే కాలపరిమితి వివరాలను తెలియజేయాలని స్పీకర్​ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది సుప్రీం కోర్టు. మే11న ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అనర్హత పిటిషన్‌ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

"ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్​లకు సంబంధించి వారంలోగా స్పీకర్​ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సొలిసిటర్​ జనరల్​ కోర్టుకు సమర్పించాలి."

- సుప్రీంకోర్టు

'స్పీకర్​ కావాలనే చేస్తున్నారు'!
అనర్హత పిటిషన్లపై​ తీర్పును గడువులోగా వెలువరించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం జూలైలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన చీఫ్ విప్‌గా ఉన్న ఎమ్మెల్యే సునీల్ ప్రభు 2022లో సీఎం ఏక్​నాథ్​ శిందేతో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్​ దాఖలు చేశారు. కాగా, ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్​ రాహుల్ నార్వేకర్ ఉద్దేశ్యపూర్వకంగానే తీర్పు వెలువరించట్లేదని.. పైగా సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు.

Last Updated : Sep 18, 2023, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.