సాయిబాబా పేరిట భక్తుల నుంచి అక్రమంగా విరాళాలను వసూలు చేస్తున్న ఆన్‌లైన్ మోసాన్ని ప్రఖ్యాత శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గుర్తించినట్లు ట్రస్ట్ సీఈఓ కన్హురాజ్ బాగ్టే సోమవారం తెలిపారు. స్వామివారి పేరిట సోషల్ మీడియా వేదికగా గుర్తు తెలియని వ్యక్తులు విరాళాలు సేకరించారనే ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
కరోనా కారణంగా ఏప్రిల్ 9 నుంచి శిర్డీ ఆలయం మూసివేశామని బాగ్డే తెలిపారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనూ అన్నదానం కోసం శిర్డీ సాయిబాబా శాంభవి సంస్థాన్ అధికాారికంగా మాత్రమే.. పేటీఎం, గూగుల్ పే ద్వారా విరాళాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. కానీ శిర్డీ ఆలయం ఎలాంటి విరాళాలను సేకరించలేదని స్పష్టం చేశారు. శిర్డీ పేరిట అక్రమ సంస్థలు విరాళాలు సేకరించాయని తెలిపారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే ట్రస్ట్‌కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: సీబీఐ అరెస్టులపై టీఎంసీ శ్రేణుల ఆందోళన