ETV Bharat / bharat

షిర్డీ సాయి సంస్థాన్ బోర్డు రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Shirdi Sai baba Sansthan board cancellation: మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్​ను రద్దు చేసింది బాంబే హైకోర్టు ఔరంగాబాద్​ బెంచ్​. మరో రెండు నెలల్లో కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

shirdi Sai baba sansthan board
షిర్డీ సాయి సంస్థాన్ బోర్డు
author img

By

Published : Sep 13, 2022, 1:40 PM IST

Shirdi Sai baba Sansthan board cancellation : షిర్డీ సాయి బాబా సంస్థాన్ బోర్డును.. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు రద్దు చేస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. మరో రెండు నెలల్లో కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని తెలిపింది. ఆలయ నిర్వహణను గతంలో మాదిరిగానే ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో చట్టవిరుద్ధంగా షిర్డీ సాయి బాబా సంస్థాన్ బోర్డును ఏర్పాటు చేశారని సామాజిక కార్యకర్త సంజయ్ కాలే.. ఔరంగాబాద్ బెంచ్​లో పిల్ వేశారు. మొదట ఎన్​సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్ష పదవిలో నియమించి.. ఆయనతో పాటు మరికొందర్ని ట్రస్ట్ సభ్యుల్ని చేశారని తెలిపారు. ధర్మకర్తల మండలిలో సభ్యుల నియామకాల్లోనూ అప్పటి సంకీర్ణ ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పిల్​పై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్​.. మంగళవారం తుది తీర్పును వెలువరించింది.

ఇవీ చదవండి: ప్రభుత్వ స్కూల్​కు బస్సు.. ఆ మొక్కలతో లాభార్జన.. ఐదేళ్ల శ్రమకు ఫలితం!

తదుపరి అటార్నీ జనరల్‌గా ముకుల్‌ రోహత్గి.. మరోసారి అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.