ETV Bharat / bharat

తండ్రి గొర్రెల కాపరి.. కొడుకు టెన్త్ టాపర్.. రోజూ 10కి.మీ నడిచి బడికెళ్లి.. - గొర్రెల కాపరి కుమారుడి పదో తరగతిలో రికార్డు

తల్లిదండ్రులు గొర్రెల కాపరులు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. ఉండేది.. సరైన రోడ్లు కూడా లేని మారుమూల గ్రామంలో. బడికి వెళ్లాలంటే రోజుకు 10 కిలోమీటర్లు నడవాల్సిందే. అయితే.. ఇవేవీ ఆ విద్యార్థి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.

shepherds son sangli
పదో తరగతిలో 91శాతం మార్కులు సాధించిన యువకుడు
author img

By

Published : Jun 21, 2022, 1:42 PM IST

పేదరికం చాలా మంది కలలను సాకారం చేసుకోకుండా అడ్డుకుంటుంది. కానీ ఈ కుర్రాడు మాత్రం పేదరికంలోనూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. పదో తరగతిలో 91 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు. అతనే మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్పాడికి చెందిన హేమంత్​ ముదే.

shepherds son sangli
పదో తరగతిలో 91శాతం మార్కులు సాధించిన హేమంత్

అట్పాడి గ్రామానికి సరిగ్గా రోడ్డు సదుపాయం లేదు. అందువల్ల రోజుకు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు హేమంత్ వెళ్లేవాడు. అతడి తల్లిదండ్రులిద్దరూ గొర్రెల కాపరులు. వీరికి ఇద్దరు సంతానం. వారిలో రెండోవాడు హేమంత్. గొర్రెల పెంపకంపైనే ఆధారపడి వీరి కుటుంబం మొత్తం జీవనం సాగిస్తోంది.

shepherds son sangli
రోడ్డు సరిగ్గా లేక బడికి నడిచివెళ్తున్న హేమంత్

గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన విద్యార్థి ఇంతటి విజయం సాధించడం పట్ల సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. భాజపా ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సదాభౌ ఖోట్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో హేమంత్‌ను కొనియాడుతూ పోస్టులు చేశారు.

ఇవీ చదవండి: టీఎంసీ నుంచి బయటకు యశ్వంత్​ సిన్హా.. అదే కారణమా?

బాలుడి అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు!.. తల్లిదండ్రుల 'నూడిల్స్' సాకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.