ఎత్తు తక్కువగా ఉండడం వల్ల తనకు పెళ్లికావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజీమ్ మన్సూరీకి ఎట్టకేలకు పెళ్లికూతురు దొరికింది. మన్సూరీ వైరల్ వీడియో చూసి.. గాజియాబాద్‌కు చెందిన రెహానా అతన్ని పెళ్లాడేందుకు ముందుకొచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే రెహానా ఎత్తు రెండున్నర అడుగులు. ఆమెకు కూడా చాలాకాలం పెళ్లి సంబంధాలు చూశారు తల్లిదండ్రులు. అయిన పెళ్లికాలేదు. దాంతో మన్సూరీ వీడియోను చూసిన రెహానా కుటుంబం పిల్లనివ్వడానికి ముందుకొచ్చింది. దీంతో అజీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇరు కుటుంబాలు కూడా ఎంతో సంతోషిస్తున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ శామ్లీకి చెందిన 26 ఏళ్ల అజీమ్ మన్సూరీ.. 3 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటారు. ఎన్నో సంబంధాలు వచ్చినా ఎత్తు తక్కువ ఉన్నందువల్ల పెళ్లి కుదరలేదని ఇటీవల మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి తనకు పెళ్లి సంబంధాలు వచ్చాయని చెప్పారు అజీమ్.
ఇదీ చూడండి: 'సల్మాన్ సినిమాలో ఛాన్స్ వద్దు.. పెళ్లే ముద్దు'