ETV Bharat / bharat

'ప్రధాని మోదీ పవర్​ఫుల్ లీడర్​.. కానీ'

Shashi Tharoor Lauds PM Modi: ప్రధాని మోదీని శక్తివంతమైన నాయకుడు, క్రీయాశీల నేతగా అభివర్ణించారు కాంగ్రెస్​ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్. అయితే మోదీ సమాజంలోకి వదిలిన కొన్ని శక్తులు.. ప్రజల్లో విషం నింపుతున్నాయని మండిపడ్డారు.

Shashi Tharoor lauds PM Modi
మోదీ అత్యంత పవర్​ ఫుల్ లీడర్
author img

By

Published : Mar 14, 2022, 10:34 AM IST

Shashi Tharoor Lauds PM Modi: ఉత్తర్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంపై ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు కాంగ్రెస్​ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్. 'మోదీ శక్తివంతమైన నాయకుడు, క్రీయాశీల నేత' అని అభివర్ణించారు. జైపుర్ లిటరేచర్ ఫెస్టివల్​లో పాల్గొన్న థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ ఓ శక్తివంతమైన, క్రీయాశీల నాయకుడు. రాజకీయ పరంగా ఆయన చేసిన పనులు చాలా అభివర్ణించదగ్గవి. ఆయన విజయాన్ని మేము ఊహించలేదు. కానీ మోదీ సాధించి చూపారు.

-- శశిథరూర్, కాంగ్రెస్​ సీనియర్ నేత

ఆ తర్వాత కొద్దిసేపటికి మోదీపై తనదైశ శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు శశిథరూర్. మోదీ సమాజంలోకి వదిలిన కొన్ని శక్తులు.. మతం, వర్గం పరంగా జాతిని విడదీస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్లో విషం నింపుతున్నారి ధ్వజమెత్తారు. అది దురదృష్టకరమన్నారు. యూపీలో ఇప్పుడు విజయం సాధించినా.. రానున్న రోజుల్లో భాజపాకు షాక్ ఇస్తారని జోస్యం చెప్పారు. యూపీలో ఎస్పీ బలమైన ప్రత్యర్థిగా ఏర్పడిందన్నారు థరూర్.

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించడం కోసం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అనేక ర్యాలీలు, ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారని, జైలుకు కూడా వెళ్లొచ్చారని అన్నారు. కానీ గత 30ఏళ్లనుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా బలహీనపడుతూ వస్తోందన్నారు.

ఇదీ చూడండి: మోదీతో యోగి భేటీ.. గంటన్నర పాటు చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.