ETV Bharat / bharat

'లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయి' - లోక్​పాల్ ఫిర్యాదుల న్యూస్

లోక్​పాల్ ఫిర్యాదులు తగ్గాయని ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్​.. రాజ్యసభకు తెలిపారు. 2020-21లో కేవలం 110 ఫిర్యాదులే వచ్చాయని పేర్కొన్నారు.

lokpal, jithendra singh
లోక్​పాల్, జితేంద్రసింగ్ యాదవ్
author img

By

Published : Aug 6, 2021, 6:41 AM IST

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయని, ఇది మంచి సంకేతమంటూ ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు తెలిపారు. ఈ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌కు 2019-20లో 1,427 ఫిర్యాదులు రాగా.. ఈ సంఖ్య 2020-21 ఏడాదికి కేవలం 110కి తగ్గగా.. ప్రస్తుత ఏడాదిలో 12 మాత్రమే అందినట్లు వివరించారు. లోక్‌పాల్‌ వ్యవస్థ సక్రమంగా నడిచేలా తగినంత సిబ్బందిని నియమిస్తామని మంత్రి సభకు తెలిపారు.

చైనాతో సైనిక చర్చలు సానుకూలం, నిర్మాణాత్మకం

తూర్పు లద్దాఖ్‌ వివాదంపై ఇటీవల చైనాతో జరిగిన రెండు దేశాల సైనిక చర్చలు పూర్తి నిర్మాణాత్మకంగా సాగాయని, మిగతా అంశాలు కూడా వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా ఉభయులూ అంగీకారానికి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సైన్యవిభాగం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ఇదీ చదవండి:'టీకా తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల విముక్తి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.