ETV Bharat / bharat

గడ్కరీతో విందు.. మోదీతో భేటీ.. 'మహా'లో ఏంటీ 'పవార్' ట్విస్ట్?

Sharad Pawar News: శివనసేన ఎంపీ సంజయ్​ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసిన రోజే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో విందు చేశారు ఎన్సీపీ అధినేత శరద్​పవార్​. ఈ విందుకు రౌత్ కూడా హజరయ్యారు. మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోదీతో పవార్ పార్లమెంటులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో మహా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అనే చర్చ మొదలైంది.

Sharad Pawar
గడ్కరీతో విందు.. మోదీతో భేటీ.. 'మహా' రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
author img

By

Published : Apr 6, 2022, 5:42 PM IST

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన ఎంపీ సంజయ్​ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రోజే కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీతో విందులో పాల్గొన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్​. దిల్లీలోని ఆయన నివాసంలోనే జరిగిన ఈ విందు కార్యక్రమానికి రౌత్​తో పాటు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మంగళవారం ఈ పరిణామాలు జరగ్గా.. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక సమావేశమయ్యారు పవార్​. పార్లమెంటులో దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది.

Sharad Pawar
గడ్కరీతో పవార్ విందు.
Sharad Pawar
గడ్కరీతో పవార్ విందు.

Sharad Pawar Modi Meet: మోదీతో భేటీ అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రౌత్​ ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేంద్ర సంస్థలు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు పూర్తి బాధ్యత కూడా వాళ్లదే అని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకే రౌత్​ను ఈడీ లక్ష్యంగా చేసుకుందని పవార్ ఆరోపించారు.

మరోవైపు మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని పవర్​ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు ఇతరులను పట్టించుకోకుండా పక్కనపెడుతున్నారు అనే భావన రాకుండా చూసుకోవాలని, ఆ బాధ్యత పూర్తిగా వారిదే అని అన్నారు. అయితే తాము(మహావికాస్​ అఘాడీ) భేటీ అయినప్పుడు ఇలాంటి విషయాలు ఏవీ ప్రస్తావనకు రాలేదని పవార్ స్పష్టం చేశారు. అలాగే యూపీఏను ముందుడి నడిపిస్తారా అని ప్రశ్నించగా.. తనకు ఆసక్తి లేదని చెప్పారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పినట్లు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: శివసేన నేత సంజయ్​ రౌత్ ఆస్తులు సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.