ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్ పుణ్యక్షేత్రాన్ని ఈ నెల 18న పునఃప్రారంభించనున్నారు అధికారులు. వేద మంత్రాలు, ఆచార సంప్రదాయాల నడుమ మంగళవారం (18న) సాయంత్రం 4:15 గంటలకు ప్రధాన ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
![Badrinath Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/81b520871e175b5420bad592107af96d_1602a_1613460929_408.jpg)
![Badrinath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11783432_01.jpg)
ప్రధాన ఆలయ తలుపులు తెరుచుకోనున్న సందర్భంగా.. కరోనా నేపథ్యంలో కేవలం 50 మందికి మాత్రమే ప్రవేశం ఉంది. దేశంలో కొవిడ్ మహమ్మారిని అంతమొందించాలని కోరుతూ.. స్వామివారికి ప్రార్థనలు చేయనున్నట్టు బద్రీనాథ్ ధామ్ పూజారి భువన చంద్ర ఉనియల్ తెలిపారు.
కేదార్‌నాథ్‌లోనూ..
రుద్రప్రయాగ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేద మంత్రాలు, ప్రత్యేక పూజల మధ్య.. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. స్వామి వారిని సుమారు 11 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆలయ ప్రముఖులు రావల్ భీమాశంకర్ లింగ్, జిల్లా మేజిస్ట్రేట్ మనుజ్ గోయల్ తదితరులు పూజలో పాల్గొననున్నారు.
![Kedaranath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/uk-rpg-05-kedarnath-kapaat-vis-byte-uk10030_16052021161847_1605f_1621162127_631.jpg)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పూజారులు, యాత్రికులకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: వెంబడించిన పోలీసులు- నదిలో దూకి పరార్!