ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ భద్రతపై అమిత్​ షా సమీక్ష - అమిత్​ షా తాజా వార్తలు

జమ్ముకశ్మీర్​లో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలపై అధికారులు షా కు వివరించారు. అంతకుముందు అమరుడైన పోలీస్​ ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ కుటుంబీకులను పరామర్శించారు.

Amit Shah in jammu kashmir
జమ్ముకశ్మీర్​లో భద్రతపై అమిత్​ షా సమీక్ష
author img

By

Published : Oct 23, 2021, 2:54 PM IST

జమ్ముకశ్మీర్​ పర్యటనలో (Amit Shah Kashmir Visit) భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. భద్రత, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు. రాజ్​భవన్​లో జరిగిన ఈ సమావేశంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సహా సైన్యానికి చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్​లో ముష్కరులను కట్టడి చేయడానికి (Amit Shah Kashmir Visit) బలగాలు తీసుకుంటున్న చర్యలపై అధికారులు షా కు వివరించారు.

Amit Shah in J&K
అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న అధికారులు

అంతకుముందు అమిత్‌ షా.. ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో (Amit Shah Kashmir Visit) అమరుడైన జమ్ముకశ్మీర్‌ పోలీస్​ ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అహ్మద్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు శ్రీనగర్‌- షార్జా మధ్య విమాన సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Amit Shah in J&K
పర్వేజ్​ కుటుంబీకులతో అమిత్​ షా
Amit Shah in J&K
పర్వేజ్​ అహ్మద్​ కుటుంబీకులను పరామర్శిస్తున్న అమిత్​ షా

కశ్మీర్​లో షా మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఆయన కశ్మీర్‌కు రావడం ఇదే మొదటిసారి.

పకడ్బందీ భద్రతాచర్యలు..

ఒకవైపు కశ్మీర్‌ లోయలో వరుసగా పౌర హత్యలు, మరోవైపు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో అమిత్‌ షా పర్యటన (Amit Shah Kashmir Visit) ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లోయలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి బస చేసే శ్రీనగర్‌లోని రాజ్ భవన్ చుట్టూ 20 కి.మీ పరిధిలో అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేసేందుకు డ్రోన్‌లు ఏర్పాటు చేశారు. సీఆర్​పీఎఫ్​ బలగాలు దాల్ సరస్సు, ఇతర ప్రాంతాలపై నిఘా చేపట్టాయి. వ్యూహాత్మక ప్రదేశాల్లో స్నైపర్లు, షార్ప్‌షూటర్‌లను మోహరించింది. స్థానిక పోలీసులు.. పౌరులతోపాటు వాహనాలనూ తనిఖీ చేస్తున్నారు.

Amit Shah in J&K
సమీక్ష నిర్వహిస్తున్న అమిత్​ షా

ఇదీ చూడండి : కశ్మీర్​లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. బైక్​ల స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.