ETV Bharat / bharat

'అందుకే దీదీ వారికి పౌరసత్వం ఇవ్వడం లేదు' - నామశూద్రులు

బంగాల్​లో మతువా, నామసూద్ర వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో చొరబాట్లను ఆపగలిగేది భాజపానేనని స్పష్టంచేశారు. నాడియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా.. కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీలపైనా ధ్వజమెత్తారు.

Union Home Minister Amit Shah, Matua
కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, మతువా
author img

By

Published : Apr 16, 2021, 3:28 PM IST

బంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. దళిత వర్గాలైన మతువా, నామసూద్రలకు పౌరసత్వాన్ని మమత తిరస్కరిస్తున్నారని ధ్వజమెత్తారు. అది ఆమె ఓటు బ్యాంకుకు నచ్చనందువల్లేనని నాడియా జిల్లా తెహత్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.

"సుమారు 50-70 ఏళ్లుగా మతువా, నామసూద్రలు బంగాల్​లో నివసిస్తున్నారు. కానీ దీదీ వారికి పౌరసత్వం ఇవ్వనంటున్నారు. ఎందుకు? ఎందుకంటే.. అది ఆమె ఓటు బ్యాంకుకు నచ్చదు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. ఆ రెండు వర్గాల సంక్షేమం కోసం రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం. బంగాల్​లో చొరబాట్లను ఆపాలా వద్దా? చొరబాటుదారులు.. మన యువత ఉద్యోగాలను, పేదల ఆహారాన్ని కొల్లగొడతారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అది రాష్ట్రానికే కాదు, యావద్దేశానికి ముప్పుగా పరిణమిస్తుంది. కాంగ్రెస్​, లెఫ్ట్ పార్టీలు చొరబాట్లను ఆపలేవు. అక్రమ వలసదారులను పక్కనబెట్టండి.. సరిహద్దుల నుంచి ఒక్క పిట్టను కూడా బంగాల్​లోకి భాజపా రానివ్వదు."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

Union Home Minister Amit Shah, Matua
ప్రసంగిస్తున్న షా- సభకు హాజరైన జనం

కేరళలో లెఫ్ట్​పై పోటీ చేస్తూ, బంగాల్​లో అదే పార్టీతో జట్టుకట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీని 'పర్యాటక నేత' అని విమర్శించారు అమిత్ షా.

"దేశంలో ఓ పర్యాటక నేత(రాహుల్ గాంధీ) ఉన్నారు. ఎన్నో దశల పోలింగ్​ జరిగినా.. రాహుల్​ బాబా ఎక్కడున్నారో తెలియదు. ఒక్క ర్యాలీ చేసి, భాజపా డీఎన్​ఏ గురించి మాట్లాడారు. మా డీఎన్​ఏ అంటే అభివృద్ధి, జాతీయవాదం, ఆత్మనిర్భర భారత్."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

టీఎంసీలో వారసత్వ రాజకీయాలను ఎండగట్టారు అమిత్ షా. పీఎం కిసాన్ సహాయ నిధిని భాజపా అమలు చేయాలని చూస్తుంటే.. దీది కేవలం మేనల్లుడి(ఎంపీ అభిషేక్ బెనర్జీ) సహాయ నిధిని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: 'మిగిలిన స్థానాలకు ఒకే దఫా పోలింగ్ పెట్టండి​'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.