ETV Bharat / bharat

'భారత్-సీషెల్స్ మైత్రి ప్రత్యేకం' - 'భారత్-సీషెల్స్ మధ్య కీలక భాగస్వామ్యం'

భారత్ అవలంబించే విధానాల్లో సీషెల్స్​కు కీలక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా సమయంలో సీషెల్స్​కు అండగా నిలిచామని, కొవిడ్ అనంతరం కూడా ఈ సహకారం కొనసాగుతుందని చెప్పారు. బిహార్ మూలాలు ఉన్న ఆ దేశ ప్రధానిని భారత దేశ ముద్దుబిడ్డగా అభివర్ణించారు.

india seychelles
'భారత్-సీషెల్స్ మధ్య కీలక భాగస్వామ్యం'
author img

By

Published : Apr 8, 2021, 7:44 PM IST

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, సీషెల్స్ దేశాల మధ్య కీలకమైన భాగస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్'(సాగర్) అనే భారతదేశ విధానంలో సీషెల్స్​ది ముఖ్యమైన స్థానమని చెప్పారు. సీషెల్స్ అధికారులతో జరిగిన అత్యున్నత సమావేశంలో వర్చువల్​గా పాల్గొన్నారు మోదీ.

కరోనా పోరులో సీషెల్స్​కు అండగా ఉంటామని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా సమయంలో అత్యవసర ఔషధాలతో పాటు 50 వేల టీకా డోసులను అందించినట్లు చెప్పారు. కొవిడ్ అనంతరం ఆర్థిక పునరుద్ధరణకూ సీషెల్స్​కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీషెల్స్ ప్రధాని వావెల్ రామ్​కలావన్​ను భారత ముద్దుబిడ్డగా అభివర్ణించారు. ఆయన మూలాలు బిహార్​లోని గోపాల్​గంజ్​లో ఉన్నట్లు చెప్పారు.

సీషెల్స్​కు రూ.100 కోట్ల నౌక

భారత సహకారంతో నిర్మించిన సీషెల్స్ మేజిస్ట్రేట్స్ కోర్టు భవనాన్ని ఈ సమావేశంలో ప్రారంభించారు. కరోనా సంక్షోభంలోనూ కోర్టు భవన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. సీషెల్స్​తో సముద్రతీర భద్రతను మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని చెప్పారు మోదీ. రూ.100 కోట్లతో భారత్​లో తయారు చేసిన గస్తీ నౌకను ఆ దేశ కోస్ట్​ గార్డ్​కు అందించారు.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.