ETV Bharat / bharat

స్కూల్​​ టాయిలెట్​లో 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి - బాలిక రేప్​

Sexual assault: పాఠశాల మూత్రశాలలోకి లాక్కెళ్లి 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుర్ఘటన మహారాష్ట్ర, పుణె నగరంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

లైంగిక దాడి
author img

By

Published : Mar 24, 2022, 3:33 PM IST

Sexual assault: బాలికల ఉన్నత పాఠశాలలోని మూత్రశాలలో 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో బుధవారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిపై శివాజీనగర్​ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

ఇదీ జరిగింది: శివాజీనగర్​ ప్రాంతంలోని ఓ ప్రముఖ ఉన్నత పాఠశాలలో 11 ఏళ్ల బాలిక చదువుతోంది. బుధవారం రోజూలానే పాఠశాలకు వెళ్లింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి బాలికతో పాటే వచ్చాడు. ఆమెతో గొడవకు దిగి బలవంతంగా పాఠశాల మూత్రశాలలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి బాధితురాలు.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి వివరించింది. బాలిక తల్లి వెంటనే శివాజీనగర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలికకు తెలిసిన వ్యక్తిగానే అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.