నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బురేవి తుపాను.. తీరం దాటిన క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తమిళనాడులోని రామేశ్వరం తీర ప్రాంతంలోని వివిధ గ్రామాలు నీటమునిగాయి. నటరాజపురమ్ ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![Burevi cyclone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9770107_burevi.jpg)
![Burevi cyclone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9770107_burevi-1.jpg)
![Burevi cyclone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9770107_burevi-5.jpg)
పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు, రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరి.. జనజీవనం స్తంభించింది. రేయిన్బో నగర్లో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
![Burevi cyclone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9770107_burevi-4.jpg)
![Burevi cyclone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9770107_burevi-3.jpg)
ఇదీ చూడండి: బురేవి ధాటికి నీటమునిగిన నటరాజస్వామి ఆలయం