ETV Bharat / bharat

Road accident in kakinada కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య - road accident in Kakinada district

Road accident in kakinada
Road accident in kakinada
author img

By

Published : May 14, 2023, 2:50 PM IST

Updated : May 14, 2023, 7:47 PM IST

14:47 May 14

ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు.. మృతులంతా మహిళలే

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

road accident in Kakinada: వారంతా రోజువారి కూలీలు.. వచ్చేది అరకొర జీతమే.. కుటుంబ పోషణ కోసం అష్ట కష్టాలు పడుతూ ముగ్గురు నలుగురు ప్రయాణించే ఆటోలో పది నుంచి 15 మంది వరకు ప్రయాణిస్తూ పనికి వస్తుంటారు.. అదే వారి ప్రాణాలమీదకు తెచ్చింది.. కాకినాడ జిల్లా తాళ్లరేవుల జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సీతారాంపురం సుబ్బారాయుడు దిమ్మ జంక్షన్ వద్ద మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో ఆరుగురు మహిళలు ఘటన స్థలిలోనే మృతిచెందగా మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందింది. మరో ఆరుగురు మహిళలు తీవ్ర గాయాలు పాలయ్యారు.. వీరిలో ఐదుగురిని తాళ్ళరేవు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల వివరాలు.. కర్రి పార్వతి(42), శేశెట్టి వెంకటలక్ష్మి(41) నిమ్మకాయల లక్ష్మి(54), అనంతలక్ష్మి(47) చింతపల్లి జ్యోతి(38), కల్లి పద్మ(38), సత్యవతి(35)

కోరంగి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తాళ్ళరేవు మండలం నీలపల్లి.. కేంద్రపాలిత యానం మెట్టుకురు గ్రామాలు చెందిన మహిళలు తాళ్లరేవులో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో రోజువారీ పనికి చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు వెయ్యి మంది వస్తుంటారు. అలానే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకుని 13 మంది మహిళలు ఆటోలో తాళ్ళరేవు హైవే రోడ్డు నుండి బైపాస్ మీదకు వస్తుండగా కాకినాడ వైపుకు వేగంగా దూసుకు వచ్చిన ప్రైవేట్ ట్రావెలర్ బస్సు.. ఆటోను బలంగా ఢీ కొట్టి కొంత దూరం లాక్కుని పోవడంతో ఆటో తుక్కుతుక్కయ్యింది. దీంతోనే ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన వారంతా యానంకు చెందినవారే..

ముఖ్యమంత్రి రంగస్వామి ఆదేశాలు.. మృతి చెందిన వారిలో యానంకు చెందిన నీలపల్లి వాసులే వారే ఎక్కువమంది ఉన్నారు. ఈ విషయంని తెలిసిన వెంటనే పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్యమంత్రి రంగస్వామి సమాచారం ఇచ్చి యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి. రెవిన్యూ అధికారులను అప్రమత్తం చేశారు.. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రమాద బాధితులు వివరాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. ప్రమాదానికి గల కారణం హైవేలో సరైన నియంత్రణ లేకపోవడంమే విమర్శలు తలెత్తుతున్నాయి. ఘటనా స్థలంలో సీసీ కెమెరా ఉన్నా అది పనిచేయట్లేదు.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్.. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కొరసాల కన్నబాబు చేరుకొని పోలీసుల ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ఇవీ చదంవడి:

Last Updated : May 14, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.