ETV Bharat / bharat

అయోధ్య టు మనాలీ ట్రిప్​!.. ఒకే కుటుంబంలోని 11 మంది మిస్సింగ్​.. ఏం జరిగింది? - మధ్యప్రదేశ్​ రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

Family Missing In UttarPradesh : ఒకే కుటుంబానికి చెందిన 10 మందితో పాటు మరో వ్యక్తి గల్లంతయ్యారు. ఉత్తర్​ప్రదేశ్​ నుంచి హిమాచల్​ ప్రదేశ్​లోని మనాలీ బయలుదేరిన ఓ కుటుంబం ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై ఆ కుటుంబం పక్కింటి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Family Missing In UttarPradesh
Family Missing In UttarPradesh
author img

By

Published : Jul 17, 2023, 7:07 AM IST

Updated : Jul 17, 2023, 7:46 AM IST

Family Missing In UttarPradesh : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య జిల్లా నుంచి హిమాచల్​ప్రదేశ్​లోని మనాలీ వెళ్లిన ఓ కుటుంబం గల్లంతయ్యింది. మొత్తం 11 మంది ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, వీరంతా మనాలీలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివారలు ప్రకారం.. అయోధ్యలోని కుమార్​గంజ్​ ప్రాంతంలో పిఠ్​లా గ్రామానికి చెందిన అబ్దుల్​ మజీద్ అనే వ్యక్తి కుటుంబం.. జులై 7న హిమాచల్​ ప్రదేశ్​లోని మనాలీకి బయలుదేరింది. జులై 10 వరకు తమ పక్కింటి వారితో టచ్​లోనే ఉన్నారు. మనాలీలో ఉన్న ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి.. తమ చుట్టాలు ఇంకా మనాలీకి చేరుకోలేదని అబ్దుల్ పక్కింటి వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో అబ్దుల్​ పక్కింటి వారు అతడిని ఫొన్​లో సంప్రదించడానికి ప్రయత్నించారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కుమార్​గంజ్​ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన వారిలో అబ్దుల్​ మజీత్​తో సహా నజ్మా, బహార్​, పర్వీన్, ఇషితహార్​, ఒమైర్, కరీనా, వారిస్​ అలి, మౌసమ్​, అల్వేరా వీరి బంధువు ఎజాజ్​ అహ్మద్​ ఉన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
మధ్యప్రదేశ్​లోని సాగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకరు గాయపడ్డారు. ఈ ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైపోయింది. ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్​-జబల్​పుర్ రోడ్డుపై ఏడుగురు ప్రయాణిస్తున్న ఓ కారు.. సాయంత్ర 5 గంటల సమయంలో సనౌధా పోలీస్ స్టేషన్​ పరిధిలో ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. మృతి చెందిన వారిలో ముగ్గురిని అర్పిత్ జైన్, బ్రిజేశ్​ ఠాకూర్​, ముక్కు ర్యాంక్వర్ గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదానికి గురైన కారు.. స్థానిక కాంగ్రెస్ నాయకుడు అమిత్​ రాంజీ దుబేకు చెందిన అమర్​దీప్​ ట్రావెల్స్​ మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ​

Last Updated : Jul 17, 2023, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.